- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ పిల్లలు కూడా గుకేష్‌లా రాణించాలని ఆశ పడుతున్నారా.? ఐతే ఇలా చేయండి.!
తల్లిదండ్రులూ ఇలా తయారుచేయండి

వైభవ్ సూర్యవంశీ క్రికెట్లో సంచలనం సృష్టిస్తే..
తమ పిల్లలు కూడా అలా కావాలి అనుకుంటారు.
గుకేష్ చెస్‌లో విజృంభిస్తే..
తమ పిల్లలూ అలా విజృంభించాలని కలగంటారు.
కానీ..
ఎప్పుడైనా వాళ్ల టాలెంట్ ఏంటో తెలుసుకున్నారా.?
విజయం ఉత్తగనే రాదు.
ఎన్నో త్యాగాలు చేస్తే.. ఎంతో సమయం వెచ్చిస్తే పిల్లలు సక్సెస్ అవుతారు.
- దిశ, ఫీచర్స్
పిల్లలకు నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఎంకరేజ్ చేసే ఓపిక ఎవరికుంది.? అమ్మ బిజీ అమ్మది.. నాన్న బిజీ నాన్నది. కుటుంబం కోసం వాళ్లు ఎంతో కష్టపడుతుంటారు. తమ పిల్లలు ఎదగాలి.. గొప్ప పేరు సంపాదించాలి అనుకుంటారు. కానీ ఎంకరేజ్మెంట్ దగ్గరకు వచ్చేసరికి ముందుకు రారు. ఇవాళ గొప్ప గొప్ప పొజిషన్లలో ఉన్న పిల్లల తల్లిదండ్రులు చేసిన త్యాగాల్లో కనీసం పావు వంతైనా చేసి అప్పుడు కలల కంటే మంచిది.
త్యాగం అసామాన్యం
మే 27, 2025న 19 ఏళ్ల గుకేష్ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. నార్వే చెస్ టోర్నమెంటులో మాగ్నస్ కార్ల్‌సెన్, అర్జున్ ఎరిగైసీలపై వరుస విజయాలతో అతడు ప్రపంచ ర్యాంకింగ్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ చారిత్రక క్షణం భారత చదరంగ చరిత్రలో ఒక మైలురాయి. కానీ ఈ విజయం వెనుక గుకేష్ ప్రతిభతో పాటు అతడి తల్లిదండ్రుల త్యాగం., అంకితభావం.. ప్రోత్సాహం కూడా ఉన్నాయి. రజినీకాంత్ వాళ్ల నాన్న.. పద్మకుమారి వాళ్ల అమ్మ. ఈ ఇద్దరు సామాన్య వ్యక్తులే. కానీ తమ కొడుకు కలను నిజం చేయడానికి అన్నీ త్యాగం చేసి అసామాన్యలుగా నిలిచారు.
ఆత్మవిశ్వాసం పెంచారు
గుకేష్‌కు ఆరేళ్ల వయసున్నప్పుడు చదరంగం పట్ల ఆసక్తి ఏర్పడింది. నిశ్శబ్దంగా ఉండి.. ఎవరితో పెద్దగా మాట్లాడని ఆ బాలుడు చదరంగం బోర్డు చుట్టూ తిరిగి.. ఆడేందుకు ఆసక్తి చూపిస్తుండేవాడు. చాలామంది తల్లిదండ్రులు దీన్ని ఒక దశగా భావించి లైట్ తీసుకునేవాళ్లు. కానీ గుకేష్ తల్లిదండ్రులు అలా చేయలేదు. తమ కొడుకు చదరంగంపై చూపిస్తున్న ఆసక్తిని వేరే కోణంలో చూశారు. వారు గుకేష్‌కు మొదటి నుంచి మద్దతు ఇస్తున్నారు. పెద్ద పెద్ద హామీలేవీ ఇవ్వలేదు కానీ.. స్థిరమైన ప్రోత్సాహం.. నమ్మకంతో గుకేష్ ఆత్మ విశ్వాసం పెరిగేలా బలాన్నిచ్చారు.
అనుక్షణం వెంటే
గుకేష్ ఇంట్రెస్ట్ చదరంగంలో ఎక్కువై.. తరుచూ దాని గురించే ఆలోచిస్తున్నప్పుడు అతడి తండ్రి రజినీకాంత్ తన ఈఎన్టీ సర్జన్ వృత్తిని వదిలేశాడు. పూర్తి శ్రద్ధ కుమారుడి కెరీర్ మీద పెట్టాడు. అతడికి శిక్షణ ఇప్పించడం.. టోర్నమెంట్లకు తీసుకెళ్లడం అన్నీ తానై చూసుకున్నాడు. తమ కొడుక్కి ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ అతడు ఆటలోని ఒడిదొడుకులను ఎదుర్కునేలా ప్రోత్సహించాడు. కష్టమైన రోజుల్లో కూడా పూర్తిచేసేదాక విరమించకు అంటూ గుర్తుచేస్తూ గుకేష్ పక్షాన ఒక ధైర్యంగా నిలబడేవాడు. ఇక వాళ్లమ్మ పద్మకుమారి కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని అందించింది. గుకేష్ దృష్టిని కుటుంబ పరిస్థితులవైపు మళ్లకుండా బలాన్ని ఇచ్చింది.
బలమైన పునాది
స్థిరమైన స్పాన్సర్ షిప్ లేకపోవడంతో గుకేష్ కుటుంబం ఎన్నో సంవత్సరాలు సవాళ్లను ఎదుర్కొంది. ప్రయాణ ఖర్చులు.. టోర్నమెంట్ ఫీజుల కోసం కొన్ని సౌకర్యాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎంత పెద్ద సమస్య ఉన్నా దాని ప్రభావం పిల్లోడి కెరీర్ మీద పడకుండా జాగ్రత్త వహించారు. ఇవాళ గుకేష్ ప్రపంచంలోనే ఉత్తమ చదరంగ ఆటగాళ్లతో కలిసి ఆడుతుంటే అతని కళ్లలో తల్లిదండ్రుల స్థిరమైన బలం కనిపిస్తోంది. ఎలాంటి హడావిడి హంగామా చేయకుండా ప్రతీరోజూ చిన్న చిన్న నిర్ణయాలతో గుకేష్ కలలకు బలమైన పునాది వేశారు. గుకేష్ కలను సమర్థించడమే కాకుండా.. అది బలపడేందుకు పూర్తి స్వేచ్చను ఇచ్చారు కాబట్టే అతడి ఆ స్థాయికి వెళ్లాడు.






