Hiccups : ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఇలా చేయండి.. వెంట‌నే త‌గ్గిపోతాయి..!

by Phanindra |

భోజ‌నం చేసే సమయంలో వస్తుంటాయి

Hiccups : ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఇలా చేయండి.. వెంట‌నే త‌గ్గిపోతాయి..!
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా, మనం తినేటప్పుడు ఏదైనా అడ్డుపడితే వెంటనే ఎక్కుళ్ళు ( Hiccups) వస్తాయి. ఇంకొందరికి, భోజ‌నం చేసే సమయంలో వస్తుంటాయి. అయితే, ఎక్కిళ్లు వాటంతటికి అవే త‌గ్గిపోతాయి. కానీ, కొంద‌రికి మాత్రం అదే పనిగా వస్తుంటాయి. అయితే, వీటిని ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

తినే స‌మ‌య‌లో ఆహారాన్ని ఫాస్ట్ గా తిన‌కూడ‌దు. దీని వలన నోట్లోకి గాలి వెళ్లి వెంటనే ఎక్కిళ్లు వ‌స్తాయి. అలాగే, ఎక్కిళ్లు అసలు తగ్గకపోతే చిన్న అల్లం ముక్క‌ను నోటిలో వేసుకుని చ‌ప్ప‌రిస్తూ ఉండాలి. ఇంకా వెనిగర్‌ను తీసుకుని మూడు చుక్క‌లు నాలుక మీద వేసుకోవాలి. ఇలా చేయడం వలన ఎక్కిళ్లు తగ్గిపోతాయి.

ఆవాల పొడిలో నెయ్యి క‌లిపి తిన్నా తగ్గుతాయి. ఎక్కిళ్లు వ‌స్తున్న స‌మ‌యంలో గాలిని పీల్చుకుని 30 సెకండ్ల అలాగే ఉండి, ఆ తర్వాత శ్వాస‌ను వ‌ద‌లాలి. దీంతో, వెంటనే పోతాయి. నిమ్మ‌కాయ‌ను క‌ట్ చేసి ఆ ముక్క‌ల‌ను తిన్నా ఎక్కిళ్ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో తేనెను కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వలన త‌గ్గిపోతాయి. శ‌రీరాన్ని సగం వరకు బెండ్ చేసి అలా వాటర్ ను తాగాలి. దీని వలన ఎక్కిళ్లు ఆగిపోతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story