- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Periods: పీరియడ్స్ వాయిదా వేసుకోవచ్చని తెలుసా.. దీని కోసం ఈ టిప్స్‌ను ఫాలో అవ్వండి!
నెలసరిని కూడా వాయిదా వేసుకోవచ్చు.

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా అమ్మాయిలకు ప్రతి నెల నెలసరి ( Periods ) వస్తుంది. దీని వలన కొందరు నీరసం అవుతారు. ఆ సమయంలో ఏ పని కూడా చేయలేరు. ఇది కొంతవరకు ఒకే కానీ, ముఖ్యమైన పనులు ఉన్నప్పుడే పీరియడ్స్ బాగా ఇబ్బంది పెడతాయి. కొన్ని సమయాల్లో ఈ నెల ఆలస్యంగా వస్తే బాగుండని అనుకుంటారు. కానీ, ఏం చేయలేము అది రావాలనుకుంటే వచ్చేస్తుంది, ఎవరు ఆపిన ఆగదు కదా అంటూ చాలా మంది బాధ పడతారు. మీకు తెలియని విషయం ఏంటంటే నెలసరిని కూడా వాయిదా వేసుకోవచ్చు. దాని కోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
నేచురల్ గా ఫాలో అయితే ఎలాంటి సమస్యలు రావు. అలాగే, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి, ఈ పద్ధతులని పాటించి పీరియడ్స్ ని కొన్ని రోజులు వాయిదా వేసుకోవచ్చు. దీనికి నిమ్మ రసం ( Lemon juice ) దీనికి మంచిగా పని చేస్తుంది. పీరియడ్స్ లో ఫ్లో అనేది కూడా తగ్గే అవకాశం ఉంది.
అలానే, పీరియడ్ కాంప్లికేషన్స్ ను తగ్గించడానికి కూడా లెమన్ హెల్ప్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే, దీనిలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. మీ పీరియడ్స్ వచ్చే వారంలో లైమ్ జ్యూస్ ను తీసుకోవడం వలన పీరియడ్స్ లేట్ అయ్యే అవకాశం ఉంది. సరిగ్గా నెలసరి రావడానికి మూడు రోజుల ముందు నుంచే లెమన్ జ్యూస్ తీసుకుంటే ఫలితం ఉంటుంది.
దీనికి ఆవాలు కూడా ఉపయోగపడతాయి. మీరు ముందుగా ఒక కప్పు వెచ్చటి పాలు తీసుకుని, దానిలో రెండు స్పూన్ల ఆవాల పొడిని కలిపి, నెలసరి వచ్చే వారంలో తాగుతూ ఉంటే … పీరియడ్స్ లేట్ గా వస్తాయి. పీరియడ్స్ వచ్చే పది రోజుల ముందు నుంచే ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వినేగార్ ను నీళ్ళల్లో కలిపి తాగితే పీరియడ్స్ రాకుండా ఉంటుంది. నెలసరిని పోస్ట్ పోన్ చేయాలని మీరు కచ్చితంగా అనుకుంటే పెప్పర్, స్పైసీ ఫుడ్స్ ను దూరం పెట్టాలని మర్చిపోకండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






