డిప్రెషన్ వల్ల జన్యువుల్లో భారీ మార్పులు.. తరువాతి తరాల్లో తీవ్ర వ్యాధులు

by Muthe.Rajitha |

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ప్రతి ఒక్కరూ డిప్రెషన్ భారిన పడుతున్నారు.

డిప్రెషన్ వల్ల జన్యువుల్లో భారీ మార్పులు.. తరువాతి తరాల్లో తీవ్ర వ్యాధులు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ప్రతి ఒక్కరూ డిప్రెషన్ భారిన పడుతున్నారు. ఉద్యోగాల ఒత్తిడి, డబ్బు సంపాదన, నిద్రలేమి, ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఎక్కువ వాడటం వల్ల అధిక ఒత్తిడికి గురవవుతున్నారు. అయితే ఈ తీవ్ర ఒత్తిడి వీళ్ళ వరకే పరిమితం కాకుండా, వీరిలో అధిక డిప్రెషన్ తరువాతి తరాలపై అత్యధిక ప్రభావం చూపనుంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజా పరిశోధనల ప్రకారం.. తల్లితండ్రుల ఒత్తిడి భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నాయి. తండ్రి ఎదుర్కునే ఒత్తిడి వల్ల అతని స్పెర్మ్‌లో రసాయన మార్పులు తెస్తున్నట్టు గుర్తించారు. ఈ మార్పులు జన్యువుల్లో భారీగా మార్పులు తీసుకువస్తునట్టు తెలిపారు.

దీంతో పుట్టబోయే పిల్లల్లో చిన్నవయసు నుంచే ఆందోళన, మెటబాలిజం సమస్యలు, డిప్రషన్ సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మానసిక ఒత్తిడి స్పెర్మ్‌ను మాలిక్యూలర్ స్థాయిలో ప్రభావితం చేయడం వల్ల ఈ మార్పులు జరుగుతున్నట్టు తేల్చారు. పిల్లలు పుట్టడానికి ముందు తల్లిదండ్రుల్లో ఉండే డిప్రెషన్ తాలూకు వ్యవస్థ.. పుట్టబోయె పిల్లలపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉందని, కాబట్టి సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story