- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, మేడ్చల్ బ్యూరో: నగరంలో గిడ్డంగులకు భలే గిరాకీ ఉంది. ఔటర్ రింగు రోడ్డు పరిసర ప్రాంతంలో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. ఆన్ లైన్ షాపింగ్ కు పెరుగుతున్న ఆదరణ, లాస్ట్ మైల్ డెలివరీ ఆవశ్యకత నేపథ్యంలో గిడ్డంగుల విభాగానికి దీర్ఘకాలిక డిమాండ్ ఉంటుందని వాణిజ్య వర్గాలు వెల్లడిస్తున్నాయి. వేర్ హౌస్ లావాదేవీలలో తయారీ రంగం వాహ నడుస్తోంది.
మేడ్చల్ క్లస్టర్ హవా..
నగరంలో మూడు క్లస్టర్లలో గిడ్డంగుల స్థలాలున్నాయి. మేడ్చల్ క్లస్టర్ లో మేడ్చల్, దేవరయాంజాల్, గుండ్ల పోచంపల్లి, కండ్లకోయ, ఎల్లంపేట, శామీర్ పేట, పటాన్ చెరువు ఇండస్ట్రీయల్ ఏరియా, రుద్రారం, పాశ మైలారం, ఏదుల నాగుల పల్లి, సుల్తాన్ పూర్, ఏరో ట్రో పోలీస్, శ్రీ శైలం హైవే, బొంగ్లూరు, కొత్తూరు, షాద్ నగర్.. ఆయా ప్రాంతాలలో గ్రేడ్ ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.19 నుంచి రూ. 21 గా గ్రేడ్ బీ అయితే రూ.16 నుంచి రూ. 19 గా ఉంది. మేడ్చల్ క్లస్టర్ లో వేర్ హౌస్ కు డిమాండ్ ఎక్కువ ఉందని వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో గిడ్డంగుల లావాదేవీలలో ఈ క్లస్టర్ వాటా 60 శాతం ఉండగా, 2024 నాటికి 61 శాతానికి పెరిగిందని అంటున్నారు. అయితే శంషాబాద్ క్లస్టర్ లో క్షీణత, పటాన్ చెరువు క్లస్టర్లలో స్వల్ప వృద్ధి కనిపించిందని చెబుతున్నారు. ఏడాది సమయంలో శంషాబాద్ వాటా30 శాతం నుంచి 27 శాతానికి తగ్గగా.. పటాన్ చెరు క్లస్టర్ వాటా 10 శాతం నుంచి 11 శాతానికి పెరిగిందని చెబుతున్నారు.
డిమాండ్ ఎందుకంటే..
హైదరాబాద్ అనేక రంగాలు ప్రొడక్షన్ లింక్డ్ న్సెంటివ్ (పీఎల్ ఐ) స్కీమ్ కింద అనుమతులు పొందాయి. ప్రధానంగా సెల్ ఫోన్ల తయారీ, ఆటో అనుబంధ రంగానికి చెందిన సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంచేసుకోవడంతో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్ ఏర్పడిందని నైట్ ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో తెలిపింది.






