- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Skills & Job Market : ర్యాంకులు, డిగ్రీలు దేనికీ పనికిరావు భయ్యా..! ఆ స్కిల్స్ లేకుంటే వేస్ట్ !!
Skills & Job Market : ర్యాంకులు, డిగ్రీలు దేనికీ పనికిరావు భయ్యా..! ఆ స్కిల్స్ లేకుంటే వేస్ట్ !!

దిశ, ఫీచర్స్ : ఇంకొక్క మార్కు వస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చేదని తెగ ఫీలైపోతుంటారు కొందరు. తమ పిల్లలకు 90 % దాటిందని మురిసిపోతుంటారు పేరెంట్స్. ఫలానా సబ్జెక్టులో అవతలి వ్యక్తికంటే తక్కువ ర్యాంక్ వస్తే కొంపలేవో కూలిపోయినంత బాధపడుతుంటారు కొందరైతే.. ఎందుకలా? మార్కులు, ర్యాంకులే మన జీవితాలను నిలబెడతాయా? కచ్చితంగా కాదనే అంటారు నిపుణులు. ఢిల్లీ యూనివర్సిటీలోని హన్స్‌రాజ్ కాలేజీలో ఇంగ్లీష్ ఆనర్స్ పూర్తిచేసిన బిస్మా ఫరీద్ (Bisma Farid) కూడా ఇదే చెబుతోంది. మార్కులు, ర్యాంకుల వేటలో పడి ఏం కోల్పోతున్నామో పేర్కొంటూ సోషల్ మీడియాలో వేదికగా పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.
మార్కులు, ర్యాంకులు తెచ్చుకోవద్దని, సంతోషపడవద్దని కాదిక్కడ, వస్తే మంచిదే. కానీ మారుతున్న కాలంలో అవి మాత్రమే ముఖ్యం కాదంటున్న బిస్మా ఫరీద్ ప్రధానంగా స్కిల్స్ ఉండాలని(Mainly there should be skills) చెబుతోంది. కాలేజీ టాపర్‌గా నిలిచిన తాను, 50 కిపైగా పలు అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు,10 పతకాలు, అనేక ట్రోఫీలు సాధించానని పేర్కొన్నది. అయినప్పటికీ వివిధ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ షిప్(Internship)కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీసారి రిజెక్ట్ అవుతున్నానని తెలిపింది. అందుకు కారణం తన వద్ద మార్కులు, ర్యాంకులు, డిగ్రీలు, సర్టిఫికెట్లు (Marks, ranks, degrees, certificates) అయితే ఉన్నాయి. కానీ స్కిల్స్ లేకపోవడమేనంటూ ఆవేదన వ్యక్తం చేసింది బిస్మా.
‘మీరు మంచి ఉద్యోగం సంపాధించాలన్నా, మీరున్న రంగంలోనైనా రాణించాలన్నా కేవలం విద్యాపరమైన అంశాలు, మార్కులు, ర్యాంకులే సర్వస్వం అనుకోకండి. ప్రాక్టికల్ నైపుణ్యాలే దేనికైనా ప్రామాణికం(Practical skills are the standard for anything.). స్కిల్స్ లేకపోతే ఏదీ సాధించలేరు. దీనికి తోడు సమర్థవంతమైన కమ్యూనికేషన్, క్రియేటివిటీ, టీమ్‌వర్క్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నవారికే జాబ్ మార్కెట్లో అవకాశాలు దక్కుతున్నాయి. అంతే తప్ప మీ ర్యాంకులు, సర్టిఫికెట్లు, డిగ్రీలు, అవార్డులు ఎవరూ పట్టించుకోరు. జస్ట్ ఇంటర్వ్యూ సమయంలోనే అవి పనికి వస్తాయి’ అంటున్న బిస్మా ఫరీద్ తన అభిప్రాయాలను లింక్డ్ ఇన్‌లో షేర్ చేయగా అనేకమంది నిజం చెప్పారంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.






