సమ్మర్‌లో డీహైడ్రేషన్.. ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్‌తో బెస్ట్ రిజల్ట్స్

by Disha Web Desk 12 |
సమ్మర్‌లో డీహైడ్రేషన్.. ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్‌తో బెస్ట్ రిజల్ట్స్
X

దిశ, ఫీచర్స్: ఎండలు మండిపోతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించేస్తున్నాడు. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు దాదాపు 40°Cకు చేరిపోతున్నాయి. దీంతో అధిక చెమట, అధిక తేమ స్థాయిలు, సూర్యరశ్మికి గురికావడం, తగినంత నీరు తాగకపోవడం మూలంగా డీహైడ్రేషన్‌‌కు గురికావడం సాధారణం. కాగా తద్వారా అలసట, తలనొప్పి, తల తిరగడం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి తగినంత నీరు తాగడం ఉత్తమ మార్గం అంటున్న నిపుణులు.. ఆహారం ద్వారా తగిన హైడ్రేషన్ పొందేందుకు కొన్ని రకాల ఫుడ్స్ రిఫర్ చేస్తున్నారు.

అధిక నీటి శాతం ఉన్న పండ్లు, కూరగాయలు ఇలాంటి వాతావరణానికి బెస్ట్ అంటున్నారు. పుచ్చకాయ, వాటర్ చెస్ట్‌నట్, పీచ్, దోసకాయ, టమోటా, సెలెరీ, పాలకూర, గుమ్మడికాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని.. పైగా సులభంగా వాటి సహజ స్థితిలోనే ఆహారంగా తీసుకోవడం ప్లస్ అవుతుందని తెలిపారు. లేదంటే ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్, స్మూతీస్, బ్రోత్స్, ఇన్ఫ్యూజ్డ్ టీ, లైమ్ వాటర్, కొబ్బరి నీరు, పెప్పర్‌మింట్ టీ, పుదీనా-ఫ్లేవర్డ్ డ్రింక్స్ వంటి ఇతర రూపాల్లో కూడా తీసుకోవచ్చు. నీరు సమృద్ధిగా ఉండే పండ్లు, కూరగాయలు విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి నీటిలో కరిగే విటమిన్లను బాగా గ్రహించడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన చర్మం పొందడంలో, మంటను నియంత్రించడంలో సహాయపడతాయి.

జ్యూస్‌లు వద్దు.. ఇన్‌ఫ్యూజ్డ్ డ్రింక్స్ బెటర్..

అయితే మధుమేహం ఉన్నవారు పుచ్చకాయ, సీతాఫలం, బెర్రీలు వంటి పండ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు నిపుణులు. 100 గ్రాముల పుచ్చకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ 72 ఉంటుంది. కానీ వాటర్ మిలన్ గ్లైసెమిక్ లోడ్ 100 గ్రాములకు 2 మాత్రమే. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని మితంగా తినవచ్చు. అయితే అధిక మోతాదులో జ్యూస్ తీసుకుంటే కార్బోహైడ్రేట్ కౌంట్ అధికమై.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అంటే ఫైబర్ చెక్కుచెదరకుండా పండ్లను తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనుమతించబడుతుంది. అయితే పండ్లను చక్కెరతో కాకుండా నీటితో కలిపి తీసుకోవడాన్ని సమర్థించారు నిపుణులు.

వాటర్‌లో ఉండే సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన లవణాలు, ఎలక్ట్రోలైట్స్ డీహైడ్రేషన్‌ను నిరోధిస్తాయి. స్వీట్ డ్రింక్స్‌కు ప్రత్యామ్నాయంగా రక్తంలో చక్కెర, బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అనేది రోజంతా హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను మెయింటెన్ చేసేందుకు మంచి మార్గం. పుచ్చకాయ నిమ్మరసం, బనానా-ఓట్ మిల్క్, బేసిల్ సీడ్స్ విత్ కేసర్ మిల్క్, బెర్రీ షుగర్-ఫ్రీ ఐస్ టీ, పుదీనా ఆకులు కలిపిన స్ట్రాబెర్రీ, చియా సీడ్స్ విత్ ఫ్రూట్స్ మిశ్రమంగా తీసుకోవచ్చు.

ఓవర్ కుక్.. మసాలా దినుసులతో ఎఫెక్ట్..

పొట్లకాయ, కాలీఫ్లవర్, బ్రోకలీ, గుమ్మడి కాయ తో పాటు పాలకూర, బచ్చలికూర, మెంతి కూర వంటి ఆకుపచ్చ కూరగాయలు వాటి అధిక ఫైబర్, నీటి కంటెంట్ కారణంగా సిఫారసు చేస్తున్నారు. కూరగాయలను ఓవర్ కుక్(ఫ్రైస్) చేయకూడదంటున్న నిపుణులు.. హై హీట్ ఎక్స్‌పోజర్ కారణంగా విటమిన్లు నష్టపోయే చాన్స్ ఉందంటున్నారు. సీడ్స్, నట్స్‌తో కలిపిన సలాడ్స్.. ఫైబర్స్, అవసరమైన కొవ్వు ఆమ్లాలను చేర్చడానికి గొప్ప మార్గమని, ఇది భోజనంలో గ్లైసెమిక్ లోడ్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతాయని తెలిపారు. వీటిలో ఫ్రక్టోజ్ ఉన్నందున అధిక షుగర్ పెరగడానికి కారణం కావు.

డయాబెటిక్స్‌లో కూడా ఫ్రక్టోజ్ రక్తంలో చక్కెర స్థాయిలను గ్లూకోజ్ కంటే గ్రాడ్యుయల్‌గా చేంజ్ చేస్తుంది. ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేయదు. గ్లూకోజ్ శరీరమంతా ప్రాసెస్ చేయబడితే.. ఫ్రక్టోజ్ కాలేయం ద్వారా జీవక్రియ చేయబడుతుంది. వాస్తవానికి పండ్లు వాటి సహజ రూపంలో ఉంటాయి. వాటిని అలాగే తీసుకునేందుకు ప్రయత్నించండి. ఉప్పు, చక్కెరతో మిక్స్ చేయవద్దు. కార్బోహైడ్రేట్ ఓవర్‌లోడ్‌ను నివారించడానికి భోజనం మధ్య ఒక పండును అల్పాహారంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది చేతులు, కాళ్ళలో తిమ్మిరిని నివారించడానికి సహాయపడుతుంది. శరీరంలో వేడిని పెంచే మసాలా దినుసులను తీసుకోవడం పరిమితం చేయాలంటున్న నిపుణులు.. అధికంగా ప్రాసెస్ చేయబడిన, ప్యాక్ చేసిన ఆహారాలు హై సోడియం కంటెంట్, కెఫిన్ కారణంగా డీహైడ్రేషన్‌కు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు.

వాటర్ రిచ్ ఫ్రూట్స్ & వెజిటేబుల్స్..

పుచ్చకాయ, స్ట్రాబెర్రీలు వాటి సహజ రూపంలో 92 శాతం నీరు కలిగి ఉంటే.. యాపిల్స్, నారింజ, పైనాపిల్స్, బ్లూబెర్రీస్, మస్క్ మిలన్ 85 నుంచి 88 శాతం నీటిని కలిగి ఉంటాయి. ఇక దోసకాయ, టొమాటోలో 95 శాతం నీరు ఉంటే.. పుట్టగొడుగులు, పాలకూర, బచ్చలికూరలో 91 శాతం.. బ్రోకలీలో 90 శాతం వాటర్ కంటెంట్ ఉంది. ఇవన్నీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు సురక్షితమైనవని తెలిపారు నిపుణులు.

ఇవి కూడా చదవండి: పిల్లలు జాగ్రత్త.. సమ్మర్‌లో వడదెబ్బకు గురయ్యే అవకాశం

Next Story

Most Viewed