భార్యాభర్తలను విడదీయడంలో దానిదే కీలకపాత్ర.. ఆ ముప్పు మీకూ ఉందా?. తెలుసుకోండి..!

by Bhoopathi Nagaiah |

మనకు ముప్ప ఉందని భావించినప్పుడు డిఫెండ్ చేసుకోవడం ప్రారంభిస్తాం. కానీ ఇది మన బిహేవియరల్ ప్యాటర్న్‌లో భాగమైతే రిలేషన్‌షిప్‌ను దెబ్బతీస్తుంది.

భార్యాభర్తలను విడదీయడంలో దానిదే కీలకపాత్ర.. ఆ ముప్పు మీకూ ఉందా?. తెలుసుకోండి..!
X

దిశ, ఫీచర్స్: మనకు ముప్ప ఉందని భావించినప్పుడు డిఫెండ్ చేసుకోవడం ప్రారంభిస్తాం. కానీ ఇది మన బిహేవియరల్ ప్యాటర్న్‌లో భాగమైతే రిలేషన్‌షిప్‌ను దెబ్బతీస్తుంది. డిఫెన్సివ్‌నెస్ అనేది కామన్ సైకలాజికల్ డిఫెన్స్ మెకానిజమ్ కాగా ఇది పదే పదే పార్టనర్‌పై ఉపయోగిస్తే.. కనెక్షన్ నాశనం అవుతుంది. సంఘర్షణ పెరిగి మిమ్మల్ని వదిలేసే పరిస్థితి రావచ్చు. ఇది సురక్షితం కాదు. కాబట్టి డిఫెన్సివ్‌నెస్ నెగెటివ్ ఇంపాక్ట్.. మిమ్మల్ని ఎమోషనల్లీ ఇమ్మెచ్యూర్ వెర్షన్‌లో బంధిస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సంబంధాన్ని నాశనం చేసే కొన్ని డిఫెన్సివ్ మార్గాల గురించి వివరిస్తున్నారు.

* వినే సామర్థ్యం: భాగస్వామి చెప్పేది వినేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపరు. గుడ్‌ లిజెనర్‌‌గా ఉండటంలో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే డిఫెన్సివ్‌నెస్ మన సొంత వాదనను నిర్మించుకునేలా చేస్తుంది. పార్టనర్ చెప్పే పదాలను వినేందుకు శ్రద్ధ చూపదు. ఈ పద్ధతి దీర్ఘకాలంలో సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది.

* ఇతరులతో అనుబంధం: డిఫెన్సివ్‌నెస్ అనేది మన చుట్టూ గోడను పెంచుతుంది. భాగస్వామిని మన దగ్గరకు చేరుకోనివ్వదు. భార్యాభర్తలు లేదా లవర్స్ మధ్య కనెక్షన్‌ను ప్రభావితం చేస్తుంది.

* భావోద్వేగ పెరుగుదల: మనం ఇతరులతో కనెక్ట్ అయినప్పుడు.. మనం మరింత ఎమోషనల్ గ్రోత్ స్టార్ట్ చేస్తాం. అయితే డిఫెండ్ ఎంటర్ అయిందంటే.. మనపై రాబోయే విమర్శలను ఆపగలం. దాంతోపాటు మన సొంత భావోద్వేగ ఎదుగుదలను కూడా అడ్డుకుంటాము.

* జవాబుదారీతనం తీసుకోవడం: మన సొంత తప్పులకు మనం బాధ్యత వహించడంలో విఫలమవుతాము. పైగా దాన్ని కప్పి పుచ్చేందుకు డిఫెండ్ చేయడం మొదలెడుతాం. ఇది సంఘర్షణను మరింత పెంచుతుంది.

* అందరు వదిలేస్తారు: తప్పో ఒప్పో.. మనం చేసిన పనులకు మనం బాధ్యత వహించడం లేదని గమనించినప్పుడు.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మనను అన్‌సేఫ్ పర్సన్‌గా చూడటం మొదలుపెడుతారు. ఆ అభిప్రాయంతోనే దూరంగా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తారు.

* పిల్లల దృష్టిలో బ్యాడ్ : పిల్లలు మనల్ని అన్ని సమయాలలో డిఫెన్సివ్‌గా చూసినప్పుడు.. మన బిహేవియర్‌ను పరిశీలిస్తారు. వారి దృష్టిలో చెడ్డగా మిగిలిపోతాం.

Next Story