- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dancing : డ్యాన్సింగ్ ఓ కళ మాత్రమే కాదు.. మెదడు సామర్థ్యాన్ని మెరుగు పరిచే వ్యాయామం కూడా..!
డ్యాన్సింగ్ డిమెన్షియా రిస్క్‌ను 76% తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి

దిశ, ఫీచర్స్ : డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం లేదా నేర్చుకోవడం కేవలం ఆసక్తి, ఆనందానికి సంబంధించిన విషయమే కాదు. అది ఆరోగ్యానికి వ్యాయామంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతుంటారు. అయితే అంతకు మించి ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని కూడా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. 2003లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. తరచుగా డ్యాన్స్ చేసే వ్యక్తుల్లో మతి మరుపునకు సంబంధించిన వ్యాధిగా చెప్పే డిమెన్షియా రిస్క్ డ్యాన్స్ వల్ల 76% తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం.
డ్యాన్స్ శారీరక శారీరక శ్రమ మాత్రమే కాదు, మెదడుకు సంబంధించిన జ్ఞానాత్మక సామర్థ్యాలను ఉత్తేజపరిచే అద్భుతమైన కదలికగానూ పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ప్రక్రియలో కో- ఆర్డినేటెడ్, రిథమిక్ యాక్షన్స్ శరీరాన్ని సమన్వయ పరుస్తాయి. అంతేకాకుండా బ్రెయిన్ న్యూరల్ కనెక్షన్‌లు బలపడతాయి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ ఇది సహాయపడుతుంది. అయితే డ్యాన్స్ ఒక సోషల్ యాక్టివిటీగా కూడా ఉంటూ ఒత్తిడిని తగ్గించి, మానసిక శ్రేయస్సును మెరుగు పరుస్తుంది. ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్‌లో పబ్లిషైన మరో స్టడీ ప్రకారం కూడా.. డ్యాన్స్ సెరిబ్రల్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా హిప్పోకాంపస్ వంటి మెదడు భాగాలలో న్యూరోప్లాస్టిసిటీని ప్రోత్సహించడం ద్వారా జ్ఞాపక శక్తిని, నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుంది.






