- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Emotional strength : సినిమా చూస్తున్నప్పుడు ఆ పని చేయడం ఏమాత్రం తప్పుకాదు..! పైగా ఆ విషయంలో మరింత మంచిది..!!
Emotional strength : సినిమా చూస్తున్నప్పుడు ఆ పని చేయడం ఏమాత్రం తప్పుకాదు..! పైగా ఆ విషయంలో మరింత మంచిది..!!

దిశ, ఫీచర్స్ : సినిమా చూడటమంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి! అదో ఆనందం.. గ్రేట్ థ్రిల్. మస్తు టైంపాస్. అందుకే ఏమాత్రం చాన్స్ దొరికినా కొత్త మూవీ ఏముందోనని వెతుకుతుంటాం. ఇక స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అయితే సెలవు దొరికితే చాలు ఎప్పుడెప్పుడు మూవీకి వెళ్దామా అని ఎదురు చూసేవారు చాలా మందే ఉంటారు. ఎందకంటే అదో గ్రేట్ ఎంటర్టైన్మెంట్ అంతే. కాగా సినిమా చూస్తున్నప్పుడు కొన్నిసార్లు అందులోని సన్నివేశాలు మనల్ని భావోద్వేగానికి గురి చేస్తుంటాయి. కొందరైతే బోరున ఏడుస్తుంటారు కూడా. అయితే ఇలా ఏడవడం చాలా మంచిదని, అది బలమైన భావోద్వేగానికి నిదర్శనమని తాజా పరిశోధన పేర్కొంటున్నది.
అధ్యయనంలో భాగంగా టిల్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మనుషుల్లో భావోద్వేగాలకు కారణమయ్యే పరిస్థితులు, వాటి ప్రభావాలపై పరిశోధనలు జరిపారు. ఈ సందర్భంగా వారు ప్రేక్షకులు సినిమాలు చూస్తున్న సమయంలో భావోద్వేగానికి లోనవడం, ఏడ్వడం భావోద్వేగ బలానికి బలమైన సంకేతమని గుర్తించారు. అలా ఏడ్చేవారు తమ జీవితంలోనూ సంతృప్తికరమైన సంబంధాలను కలిగి ఉంటారని చెబుతున్నారు. అందేకాకుండా భావోద్వేగ ప్రతి స్పందన, హయ్యర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గొప్ప మనస్తత్వానికి నిదర్శమని కూడా పేర్కొన్నారు.
సాధారణంగానే సినిమాల్లోని అనేక సన్నివేశాలు భావోద్వేగంతో ముడి పడి ఉంటుంది. ఆ సమయంలో సినిమాల్లోని ఆకర్షణీయమైన పాత్రలు, కథలు, సన్నివేశాలు మనలో కలిగించే ప్రతి స్పందనలే అందుకు దారితీస్తుంటాయి. కాగా ఈ సందర్భంలో ఏడ్వడం అనేది మాత్రం మనసును తేలిక పర్చడమే కాకుండా ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలను కూడా ప్రేరేపిస్తుంది. ఇదొక ‘Sympathetic hormone’ హార్మోన్. ఇది రిలీజ్ అవడం వల్ల వ్యక్తిలో మానసిక ఆనందం కలగడమే కాకుండా, మానసిక శక్తి సామర్థ్యాలను పెంచుతుందంటున్నారు పరిశోధకులు. అందుకే సినిమాలు చూస్తున్నప్పుడు ఎమోషనల్ అయ్యే పరిస్థితిని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని, ఏడుపు వస్తే ఏడవాలని నిపుణులు సూచిస్తున్నారు.






