Green Vegetables: పోషకాలు పోకుండా ఇలా వండేయండి..!

by Kanadam.Hamsa lekha |   (  Updated:2024-11-30 16:42:57  IST  )

ఆకు కూరలు, ఆకుపచ్చటి కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Green Vegetables: పోషకాలు పోకుండా ఇలా వండేయండి..!
X

దిశ, ఫీచర్స్: ఆకు కూరలు, ఆకుపచ్చటి కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని డైలీ తినడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. వీటిల్లో కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. కంటి ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా చర్మ ఆరోగ్యానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. అయితే, ఈ పోషకాలు ఉన్న ఆకుపచ్చటి కూరగాయలు వండేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే అందులో ఉండే ప్రొటీన్లు పూర్తిగా శరీరానికి అందుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చదివేయండి.

ఆకు పచ్చటి కూరగాయలు అంటే బ్రకోలి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బచ్చలి కూర, తోట కూర, కొత్తిమీర, పాలకూర వంటి మొదలైనవి ఆకు పచ్చటి కూరగాయాల కిందికి వస్తాయి. అయితే, వీటిని వండేటప్పుడు కొంత సమయం వరకు వేడి నీళ్లలో ఉంచిన తరువాత కూర వండితే వంట త్వరగా అవుతుంది. అది మాత్రమే కాకుండా.. కూరగాయలు వేడి చేసిన నీళ్లను అదే కూరలో ఉపయోగించడం వల్ల వాటిలోని పోషకాలు బయటికి పోకుండా ఉంటాయి.

* ఆకు పచ్చటి కూరలను వండేటప్పుడు కొంచెం వెన్న లేదా ఆలివ్ ఆయిల్ ఉపయోగించి వాడడం వల్ల అందులో ఉండే పోషకాలు తగ్గిపోకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

* వీటిని వండే క్రమంలో ఉప్పు, మిరియాల పొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వంటివి ఉపయోగిస్తే కూర రుచిగా ఉండడమే కాకుండా అందులోని పోషకాలు శరీరానికి అందుతాయి.

* ఎప్పుడూ కూడా ఆకు పచ్చటి కూరగాయలను వండేటప్పుడు అందులో కొంచెం నీటిని ఉపయోగించాలి. కొంతమంది కూరని గ్రేవి లేకుండా అలాగే వండేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వాటి రంగు మారిపోయి, పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకే ఆకు పచ్చటి కూరగాయలను వండేటప్పుడు కొద్దిగా నీళ్లను కూరలో ఉపయోగించాలి.

* చాలామంది కూర చల్లారిపోయిందని వేడి చేసుకుని తింటుంటారు. ఇలా చేయడం వల్ల అందులోని పోషకాల స్థాయి నశిస్తుంది. ముఖ్యంగా గ్రీన్ వెజిటేబుల్స్‌‌ని పదే పదే వేడి చేయకూడదు. ఒక్కసారి కూర వండిన తరువాత దానిని మళ్లీ వేడి చేయకుండా తినడమే మంచిది.

* ముఖ్యంగా గ్రీన్ బీన్స్‌ను ఉడకబెట్టిన తరువాతే కూరకి వాడాలి. లేదంటే జీర్ణ సమస్యలకు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉడకబెట్టిన తరువాత వీటిని కూరకు ఉపయోగిస్తే అందులో ఉండే ప్రొటీన్లు, ఫైబర్ శరీరానికి మేలు చేస్తాయి.

* ఆకు పచ్చటి కూరగాయలతో కూర చేసేటప్పుడు వాటి చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని కూరకు ఉపయోగించాలి. అలా కాకుండా చిన్న ముక్కలను కట్ చేసి వండడం వల్ల పోషకాల విలువను కోల్పోయే చాన్స్ ఉంటుంది.

Read More...

Heart Health : గుండెకు ఒత్తిడి ముప్పు.. బయటపడే మార్గమిదే..




Next Story