Health Tips : బాదం పాలు ఆరోగ్యానికి మంచిదే కానీ.. అతిగా తీసుకున్నా నష్టమే!

by Javid Pasha |   (  Updated:2025-06-26 08:06:06  IST  )

Health Tips : బాదం పాలు ఆరోగ్యానికి మంచిదే కానీ.. అతిగా తీసుకున్నా నష్టమే!

Health Tips : బాదం పాలు ఆరోగ్యానికి మంచిదే కానీ.. అతిగా తీసుకున్నా నష్టమే!
X

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండటానికి తీసుకునే ముఖ్యమైన న్యూట్రిషన్ ఫుడ్స్‌లో బాదం కూడా ఒకటి. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయని చెబుతారు. అయితే అతిగా తింటే మాత్రం బెడిసి కొడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బాదం పాలు తరచుగా తాగడం లేదా తాగినప్రతిసారి ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపుతాయి. ముఖ్యంగా శిశువులకు వీటిని ఇవ్వకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇవి తల్లి పాలు లేదా ఫార్ములా మిల్క్‌లో ఉండే పోషకాలను అందించలేవు. ఇంకా ఏయే రకాల దుష్ప్రభావాలు ఉంటాయో చూద్దాం.

* బాదం పాలు లేదా బాదం అతిగా తీసుకోవడంవల్ల పిల్లల్లో, పెద్దల్లో కడుపులో ఉబ్బరం, అజీర్తి, వికారం, అతిసారం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే బాదంలోని అధిక ఫైబర్, ఆక్సలేట్లు, కొవ్వులు, ఖనిజాలు వంటి అధిక పోషకాలు శరీరంలో అసమతుల్యతను సృష్టించవచ్చు. అలాగే, బాదం పాలు గాయిట్రోజెనిక్ ఆహారంగా పరిగణించబడతాయి. అంటే అవి అధిక మొత్తంలో తీసుకుంటే థైరాయిడ్ గ్రంథి పనితీరును దెబ్బతీస్తాయి. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు దీనిని తక్కువగా తీసుకోవాలి లేదా పూర్తిగా నివారించాలి.

*బయట వాణిజ్య పరంగా తయారు చేసిన బాదం పాలలో సాధారణంగానే అధిక చక్కెరలు ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్‌ను పెంచుతాయి. తరచుగా బాదం తినడం లేదా బాదం పాలు తాగడం అధిక బరువు పెరగానికి కూడా దారితీస్తుంది. ఇలా జరగకూడదంటే ఇంట్లో తయారు చేసిన చక్కెర లేని బాదం పాలు తీసుకోవడం బెటర్. అలాగే నట్ ఎలర్జీ ఉన్నవారికి బాదంపాలు అస్సలు పడవు వ్యక్తిగత ఆసక్తి, ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలాగనీ బాదం అసలుకే మంచిది కాదేమో అనుకుంటే చాలా పొరపాటు. అతిగా తీసుకోవడం మాత్రమే అనర్థాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. బాదంలో తక్కువ కేలరీలు, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మితంగా తీసుకుంటే మేలు చేస్తాయి. అతిగా తీసుకుంటే అనర్థాలకు దారితీస్తాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story