- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టేస్టీగా ఉంటాయని Packaged snacks తింటున్నారా..? ఆ రిస్క్ తప్పదంటున్న నిపుణులు
టేస్టీగా ఉంటాయని Packaged snacks తింటున్నారా..? ఆ రిస్క్ తప్పదంటున్న నిపుణులు

దిశ, ఫీచర్స్ : మనలో చాలా మంది ఆరోగ్యానికి మంచిదా.. కాదా? అనేదానికంటే.. టేస్టీగా ఉన్నాయా.. లేదా? అనే దానిని బట్టే స్నాక్స్‌కు ప్రయారిటీ ఇస్తుంటాం. రుచిగా ఉంటే చాలు ఏమాత్రం ఆలోచించకుండా లాగేస్తుంటాం. ముఖ్యంగా చిప్స్, కుర్ కురే, బిస్కెట్లు, చాక్లెట్లు, నమ్కీన్, పిజ్జా, బర్గర్ వంటివి సహా పలు రకాల స్నాక్స్ ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లలో ప్యాకేజ్డ్ ఫుడ్స్‌గానే లభిస్తుంటాయి. నిజానికి ఇవి హెల్త్‌కి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ చాలామంది వాటినే ఇష్టపడుతుంటారు. కారణం.. రుచిగా ఉంటాయి. కానీ తరచుగా ప్యాకేజ్డ్ స్నాక్స్ తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమని ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఎక్కువ రోజులు పాడవకుండా ఉండేందుకు ప్యాకేజ్డ్ స్నాక్స్ లేదా ఆహార పదార్థాల్లో యూజ్ చేసే కెమికల్ ఎక్స్‌పోజర్ వల్ల పిల్లల్లో ముఖ్యంగా బాలికల్లో శారీరక, మానసిక ఎదుగుదల ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి కాలేజ్ ఆఫ్ మెడిసిన్(University of Cincinnati College of Medicine)కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. అధ్యయనంలో భాగంగా వీరు మొత్తం 824 మంది బాలికలు, మహిళలకు సంబంధించిన హెల్త్ రిపోర్టులను ఎనలైజ్ చేశారు. వీరిలో హెయిర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్‌మెంట్ సహా అన్ని యవ్వనదశ లక్షణాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఓవరాల్‌గా 24 శాతం మంది బాలికల్లో ప్యాకేజ్డ్ స్నాక్స్ లేదా ఫుడ్స్‌లోని ఫరెవర్ కెమికల్స్‌కు బహిర్గతం కావడంవల్ల తర్వాతి దశలో రుతుక్రమ సమస్యలు ఏర్పడ్డాయని, 42 శాతం మంది మహిళల్లో కిడ్నీ సంబంధిత సమస్యలు పెరిగాయని గుర్తించారు. అందుకే తరచుగా ప్యాకేజ్డ్ స్నాక్స్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తున్నారు.






