- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trending : స్త్రీలతో పోలిస్తే తక్కువ ప్రేమను, సానుభూతిని పొందుతున్న పురుషులు.. కారణమిదే..
స్త్రీలతో పోలిస్తే పురుషులు తమ ప్రియమైన వ్యక్తి నుంచి గానీ, భాగస్వామి నుంచి గానీ, సమాజం నుంచి గానీ సమానమైన ప్రేమను, సానుభూతిని, ఎమోషనల్ సపోర్ట్‌ను పొందలేకపోతున్నారు.

దిశ, ఫీచర్స్ : నిరాశలో మీరుంటే.. ఆశల హరివల్లై వికసించేదే ప్రేమ.. ఆపదలో మీరుంటే.. బయటపడే మార్గం చూపేదే ప్రేమ.. సమస్యల సుడిగుండాల్లో మీరు చిక్కుకుంటే.. పరిష్కార మార్గమై దరిచేర్చే గమ్యమే ప్రేమ.. కానీ ఇప్పుడా పరిస్థితి తలకిందులవుతోంది. ముఖ్యంగా స్త్రీలతో పోలిస్తే పురుషులు తమ ప్రియమైన వ్యక్తి నుంచి గానీ, భాగస్వామి నుంచి గానీ, సమాజం నుంచి గానీ సమానమైన ప్రేమను, సానుభూతిని, ఎమోషనల్ సపోర్ట్‌ను పొందలేక.. నిరాశలో కూరుకుపోతున్నారని, ఇది వారిని మరింత బలహీనులుగా మారుస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. Association for Psychological Science కొత్త నివేదిక సైతం దాదాపు ఇదే వెల్లడించింది. పురుషులు స్త్రీలకంటే ఎక్కువ ప్రేమను ఎన్నడూ అనుభవించలేదని పేర్కొన్నది.
స్త్రీలు సాధారణంగా భర్త/ప్రియమైన వ్యక్తి, అలాగే బంధుత్వాలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు వంటి వివిధ సంబంధాల నుంచి తగిన భావోద్వేగ మద్దతును పొందుతున్నారు. సమాజంలోనూ, కార్యాలయాల్లోనూ వీరిపట్ల సానుభూతి ఎక్కువే. దీంతో స్త్రీలు మానసికంగా చూసినప్పుడు ప్రశాంతంగా, దృఢంగా ఉండగలుగుతున్నారు. కానీ పురుషులు మాత్రం అందుకు భిన్నమైన అనుభవాలను ఎదుర్కోవడం కారణంగా అవస్థలు పడుతున్నారు. ఇక పురుషులకు లభిస్తున్న ప్రేమ, సానుభూతి కేవలం వారు నమ్ముకున్న భాగస్వామి లేదా ప్రియమైన వ్యక్తి నుంచి మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పురుషులు ఎమోషనల్ సపోర్ట్ కోసం తమ శృంగార, ప్రేమ సంబంధాలపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు. ఇవి విఫలమైనప్పుడు లేదా అసలే లేనప్పుడు చాలామంది పురుషులు ఒంటరి తనానికి గురవుతున్నారు. ఈ పరిస్థితి వారిని భావోద్వేగ పరంగా బలహీనంగా మారుస్తోందని, తాజా ఈ పరిస్థితి సాధారణంగా సమాజంలో నెలకొన్న పురుషుల గురించిన ఊహలకు విరుద్ధంగా అనిపించినప్పటికీ కనిపిస్తున్న వాస్తవమని నిపుణులు చెబుతున్నారు.
పురుషుల గురించి సమాజంలో నెలకొన్న సాంప్రదాయ భావనలను ఒక తాజా అధ్యయనం సవాలు చేస్తున్నది. అంతేకాకుండా పురుషులు ఎమోషనల్ సపోర్ట్ అందని కారణంగా మానసిక ఆరోగ్య సమస్యల రిస్క్‌లో పడుతున్నారని, నిజానికి వీరు శృంగార ఆదర్శవాదులని (Shows romantic idealism) పేర్కొన్నది. ఎందుకంటే స్త్రీలతో పోలిస్తే.. పురుషులు తమ భావోద్వేగ అవసరాలకోసం ఒకే సంబంధంపై ఆధారపడే అవకాశం ఎక్కువ. అందుకే తాము ప్రాణంగా భావించే బంధం దూరమైనప్పుడు తట్టుకోలేకపోతారని, ప్రేమలేని భావనతో, ఒంటరితనంతో కుమిలిపోతారని నిపుణులు చెబుతున్నారు. సమాజంలో పురుషులు బలంగా, స్వతంత్రంగా కనిపించాలనే సామాజిక ఒత్తిడి, సాంప్రదాయ భావనలు కూడా వారి భావోద్వేగ వ్యక్తీకరణను అణచివేస్తున్నట్లు(The pressure to appear strong and independent also suppresses their emotional expression) నివేదికలు పేర్కొంటున్నాయి. పురుషుల భావోద్వేగ అవసరాలపై దృష్టి సారించి, సమాజంలో మరింత సమతుల్యమైన భావోద్వేగ మద్దతు వ్యవస్థల అవసరాన్ని కూడా ఈ ఈ అధ్యయనం హైలైట్ చేస్తున్నదని చెబుతున్నాయి. లింక్
Also Read..
AI Psychosis : ‘ఏఐ సైకోసిస్’ టెక్నాలజీ అధిక వినియోగంతో ఏర్పడుతున్న భ్రమలు..!






