- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూత్రంతో ఆ రోగాలు ఇట్టే మాయం.. గిరాకీ చూస్తే అవాక్కవ్వడం ఖాయం?
చైనాలోని ఓ జంతు ప్రదర్శనశాల పులి మూత్రం అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవును సిచౌన్ ప్రావిన్స్‌లోని Ya'an Bifengxia Wildlife Zooలో ఇలా జరుగుతుందని ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు.

దిశ, ఫీచర్స్ : చైనాలోని ఓ జంతు ప్రదర్శనశాల పులి మూత్రం అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవును సిచౌన్ ప్రావిన్స్‌లోని Ya'an Bifengxia Wildlife Zooలో ఇలా జరుగుతుందని ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. టైగర్ యూరిన్ రుమాటిక్ డిజార్డర్స్(జాయింట్ పెయిన్స్) నయం చేస్తుందని ప్రచారం చేస్తున్నారు అక్కడి జూ అధికారులు. వైట్ వైన్‌లో దీన్ని కలిపి అప్లయ్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు. ఆవు మూత్రం తాగడం వల్ల కలిగే బెనిఫిట్స్ దీనితోనూ ఉంటాయని అంటున్నారు. 250 గ్రాముల బాటిల్‌కు దాదాపు రూ. 600 వసూల్ చేస్తున్నారు కూడా. ఇక దీనిపై కస్టమర్స్ కొందరు నెగెటివ్‌గానే స్పందించారు. క్యురియాసిటీతో కొన్నాం కానీ ఎలాంటి ఎఫెక్ట్స్ లేవంటున్నారు.
ఏదేమైనా ఈ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరిన్ వినియోగం అనారోగ్యానికి కారణమవుతుందని వార్న్ చేస్తున్నారు. ఇది బాడీ బై ప్రొడక్ట్ అని.. దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయనే సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదంటున్నారు. ఇలా యూజ్ చేసే ముందు ఎక్స్‌పర్ట్స్‌ను సంప్రదించడం మంచిదని.. గుడ్డిగా ఫాలో కాకూడదని సూచిస్తున్నారు.






