బ్యాంకులో నగ్న ఫొటోల షూరిటీ.. అప్పు కావాలా? అయితే న్యూడ్ ఫొటోస్ పంపండి..!

by Disha Web Desk |
బ్యాంకులో నగ్న ఫొటోల షూరిటీ.. అప్పు కావాలా? అయితే న్యూడ్ ఫొటోస్ పంపండి..!
X

దిశ, ఫీచర్స్: అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు, వడ్డీ వ్యాపారస్తులు ఇల్లు, భూమి, బంగారం లాంటి విలువైన వస్తువులను తనఖా పెట్టమని అడుగుతారు. కానీ చైనాలోని ఓ మనీ లెండింగ్ ప్లాట్‌ఫామ్ మాత్రం నగ్న ఫొటోలను తాకట్టు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఈ విధంగా JD క్యాపిటల్స్ జీదైబావో అనే కంపెనీ ప్రత్యేక ప్రాచుర్యం పొందింది. అప్పు కావాలనుకునే మహిళా విద్యార్థులను వారి ఐడి కోసం నగ్నంగా పోజులివ్వమని అడుగుతోంది. ఈ ఫొటోలనే డబ్బులు రికవరీ చేసేందుకు సెక్యూరిటీ పర్పస్‌గా వాడుతోంది. ఒకవేళ రుణం చెల్లించకపోతే.. ఆ న్యూడ్ పిక్స్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపిస్తామని బెదిరిస్తోంది.

ఈ కండిషన్‌కు ఒప్పుకున్న విద్యార్థులకు రెండు నుంచి ఐదు రెట్లు ఎక్కువ రుణ మొత్తాన్ని అందిస్తోంది. కానీ వడ్డీ రేటు వారానికి 30శాతం వరకు ఉంటుంది. ఈ క్రమంలో ఒక విద్యార్థి రూ.14 లక్షలు తీసుకోగా.. అప్పు కేవలం నాలుగు నెలల్లోనే రూ. 34లక్షలకుపైగా చేరుకుంది. దీంతో న్యూడ్ ఫొటోస్ ప్రచురిస్తామని బెదిరించడంతో చేసేదేమీ లేక ఆమె కుటుంబ సహాయం తీసుకోవాల్సి వచ్చి్ందని 2016లో అక్కడి స్థానిక మీడియా నివేదించింది.

Also Read..

వర్షంలో తడుస్తూ.. చలికి వణుకుతూ.. 21 గంటలు మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్..


Next Story