- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దోమల నుంచి రక్షణకు అద్భుత పరిష్కారం.. బగ్ కిల్లింగ్ లేజర్ డివైజ్‌ను డెవలప్ చేసిన శాస్త్రవేత్తలు
దోమల నుంచి రక్షణకు అద్భుత పరిష్కారం.. బగ్ కిల్లింగ్ లేజర్ డివైజ్‌ను డెవలప్ చేసిన శాస్త్రవేత్తలు

దిశ, ఫీచర్స్ : అభివృద్ధిలో ఎంత ముందున్నా దోమల నివారణలో మాత్రం చాలా దేశాలు వెనుకబడే ఉన్నాయి. దీంతో ప్రతీ సంవత్సరం డెంగ్యూ, మలేరియా వంటి దోమ కాటు వ్యాధుల వల్ల అనేకమంది అవస్థలు పడుతున్నారు. కొన్నిసార్లు మరణాలు సైతం సంభవిస్తున్నాయి. దోమకాటుకు గురికాకుండా ఉండేందుకు దోమ తెరలు, కాయిల్స్, సువాసలు వంటి తాత్కాలిక పరిష్కారాలే ఉన్నాయి తప్ప, అసలు దోమలే లేకుండా చేయగల పూర్తిగా నివారించే పరిస్థితులైతే ఎక్కడా లేవు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంపై నిరంతర పరిశోధనలు సైతం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో చైనా శాస్త్రవేత్తలు దోమలను నాశనం చేయగల ‘బగ్ కిల్లింగ్ లేజర్ డివైజ్’ను డెవలప్ చేశారు.
శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఫోటాన్ మ్యాట్రిక్స్ అనే లేజర్ ఆధారిత పరికరం(Bug killing laser device)సెకనుకు 30 దోమలను నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఇది దోమలను నాశనం చేయడానికి ఆటోమేటెడ్ కార్లలో ఉపయోగించే లైడార్ టెక్నాలజీని వినియోగిస్తుంది. గాలిలో ఉన్న దోమలను సైతం కేవలం మూడు సెకన్లకంటే ముందుగానే గుర్తిస్తుంది. దోమను గుర్తించిన వెంటనే ఈ పరికరంలోని సాంకేతిక వ్యవస్థ కచ్చితమైన లేజర్ కిరణంతో దానిని నిర్మూలిస్తుంది. మానవులు లేదా పెంపుడు జంతువులకు హాని కలగకుండా ఉండేందుకు, పెద్ద వస్తువులను స్కాన్ చేసిన తర్వాతే లేజర్‌ను ప్రయోగిస్తుంది.
ప్రస్తుతం ‘బగ్ కిల్లింగ్ లేజర్ డివైజ్’ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉందని నిపుణులు చెబుతున్నారు. 3 మీటర్ల రేంజ్ ఉన్న బేసిక్ మోడల్ ఒకటైతే, 6 మీటర్ల రేంజ్ ఉన్న ప్రో మోడల్ రెండవది. రెండూ వాటర్‌ప్రూఫ్‌గా ఉండి, పోర్టబుల్ బ్యాటరీతో ఇండోర్, ఔట్‌డోర్ పరిస్థితుల్లో దోమలను నిర్మూలించడానికి, చుట్టు పక్కల పరిసరాల్లో దోమలు రాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉన్న ఈ పరికరానికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మలేరియా, డెంగ్యూ వంటి దోమల వల్ల వచ్చే వ్యాధులకు భవిష్యత్ పరిష్కారంగా ప్రశంసలు అందుకుంటోంది. Link






