- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెస్టారెంట్‌లో సర్వర్‌గా ఒలింపిక్ మెడల్ విన్నర్.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే!
పారిస్ ఒలింపిక్స్ - 2024 క్రీడలు ముగిశాయి. తమ తమ దేశాలకు పతకాలను అందించిన విజేతలను సగర్వంగా, ప్రేమతో స్వాగతించారు జనాలు. వారిపై ప్రశంసల వర్షం కురిపించారు.

దిశ, ఫీచర్స్ : పారిస్ ఒలింపిక్స్ - 2024 క్రీడలు ముగిశాయి. తమ తమ దేశాలకు పతకాలను అందించిన విజేతలను సగర్వంగా, ప్రేమతో స్వాగతించారు జనాలు. వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక పతకాల లిస్ట్ లో USA 126 మెడల్స్ సాధించి ముందుండగా.. చైనా 91 మెడల్స్ తో రెండో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే ఈ దేశానికి చెందిన జిమ్నాస్ట్ జొయూ యాకిన్ పారిస్ నుంచి ఇంటికి చేరుకున్న వెంటనే అమ్మకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది.
వచ్చి వారం అయిందో లేదో గునన్ ప్రావిన్స్ లోని హెన్గ్ యంగ్ సిటీలో తన మదర్ నడుపుతున్న ఫ్యామిలీ రెస్టారెంట్ ఉండగా.. అక్కడ సర్వ్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అటు ఆటల్లో ఇటు ఇంట్లో కుటుంబం కోసం ఆమె పెడుతున్న డెడికేషన్ కు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇలాంటి ఆటిట్యూడ్ అందరు పిల్లలకు ఉంటే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.






