- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరీ ఇంత దారుణమేంటి బ్రదర్.. పేడను స్వీట్ అని అమ్మేస్తున్నారు.. పైగా ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..
ఏనుగు పేడను డెజర్ట్‌గా మార్చేసింది చైనా రెస్టారెంట్. షాంఘైలోని కానోపియా రెస్టారెంట్ ఈ వివాదాస్పద డెజర్ట్‌ను ఇంట్రడ్యూజ్ చేసింది. రెయిన్ ఫారెస్ట్

దిశ, ఫీచర్స్ : ఏనుగు పేడను డెజర్ట్‌గా మార్చేసింది చైనా రెస్టారెంట్. షాంఘైలోని కానోపియా రెస్టారెంట్ ఈ వివాదాస్పద డెజర్ట్‌ను ఇంట్రడ్యూజ్ చేసింది. రెయిన్ ఫారెస్ట్ థీమ్‌తో అలంకరించిన నిర్వాహకులు.. ఇకోలాజికల్ ఫ్యూజన్ క్యూసిన్‌లో భాగంగా ‘‘ఫ్లవర్స్ ఇన్సర్టెడ్ ఇంటూ ఎలిఫెంట్ డంగ్’’ అనే కొత్త వంటకాన్నిపరిచయం చేశారు. ఇండియన్ కరెన్సీలో దీని ధర దాదాపు రూ. 50వేలు. కాగా రెయిన్‌ఫారెస్ట్ పోషక చక్రం నుంచి స్ఫూర్తి పొందిన ఈ వంటకం.. క్రిమిరహితం చేయబడిన, ఎండిన ఏనుగు పేడను క్రిస్పీ రొట్టెలుగా చేసి, దానిపై హెర్బల్ పెర్ఫ్యూమ్, ఫ్రూట్ జామ్, పుప్పొడి, తేనెతో అలంకరిస్తారు. ఈ పేడను యున్నాన్ ఏనుగు సంరక్షణ కేంద్రం నుంచి సేకరించి.. అధిక ఉష్ణోగ్రత, అతినీలాలోహిత ట్రీట్మెంట్స్‌తో క్రిమిరహితంగా మార్చేస్తారు. ఏడేళ్ల పరిశోధన తర్వాత ఈ డెజర్ట్‌ను పరిచయం చేసినట్లు రెస్టారెంట్ యజమానులు తెలిపినా... ఈ వంటకం దారుణమైన విమర్శను ఎదుర్కొంది. వినడానికే వికారంగా ఉందని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల కోసం ఎంతకైనా తెగిస్తారా అని ఫైర్ అయ్యారు. మరోవైపు క్రియేటివిటీని మెచ్చుకున్నవారు కూడా లేకపోలేరు.
అయితే చైనా ఆహార శుభ్రత చట్టం ప్రకారం ఆహారం విషరహితంగా, హానిరహితంగా ఉండాలి. కానీ ఈ డెజర్ట్ ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా అనేది అస్పష్టంగా ఉంది. ఎందుకంటే జంతు విసర్జనను వంటకాలలో ఉపయోగించడం దేశ నియంత్రణ వ్యవస్థలో ఇంతకు ముందు లేదు. ఇక ఈ డెజర్ట్‌పై ప్రజల ఆగ్రహం, మీడియా, సోషల్ మీడియా ఫోకస్ చేసిన తర్వాత.. షాంఘై అధికారులు కానోపియాపై ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనల గురించి విచారణ ప్రారంభించారు. దీంతో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేయబడింది. అయితే యజమానులు మాత్రం వంటకాల సరిహద్దులను చెరిపేయడానికి, ఇకోలాజికల్ అనుసంధానాన్ని హైలెట్ చేసేందుకు చేసిన తమ ప్రయత్నాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.






