పిల్లలు.. పెద్దలు.. అందరిలోనూ డిప్రెషన్.!

by Daayi Srishailam |

పిల్లలు.. పెద్దలు.. అందరిలోనూ డిప్రెషన్.!
X

పిల్లలు..

పెద్దలు..

మహిళలు..

పురుషులు..

ఇలా వాళ్లూ వీళ్లూ అని కాదు..

అందరూ ఫేస్ చేస్తున్న కామన్ సమస్య డిప్రెషన్.

డిప్రెషన్ ఎందుకు వస్తుంది.?

ఎలా తగ్గించుకోవాలి.? తెలుసుకుందాం.

- దిశ, ఫీచర్స్

డిప్రెషన్ అంటే.?

ఒక అధ్యయనం ప్రకారం.. 29% మంది పెద్దలు తమ జీవితంలో ఏదో ఒక సమస్యతో.. ఏదో ఒక సమయంలో డిప్రెషన్‌కు లోనవుతున్నారు. చదువు.. ఉద్యోగం.. వృత్తి.. లింగ భేదం వంటి కారణాలతో ఈ సమస్య వస్తంది. డిప్రెషన్ ఒక సంక్లిష్టమైన మానసిక ఆరోగ్య సమస్య. ఇది వివిధ రూపాల్లో వ్యక్తమవుతూ నిర్ధారణను కష్టతరం చేస్తుంది.

ఎన్ని రకాలు.?

మేజర్ డిప్రెసివ్ డిజార్డర్: అత్యంత సాధారణ రకం. కనీసం రెండు వారాల పాటు నిరంతర నిరాశ.. బలహీనత.. ఆకలి మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

పెర్సిస్టెంట్ డిప్రెసివ్ డిజార్డర్: రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కృంగుబాటు లక్షణాలు కనిపిస్తాయి.

పోస్ట్ పార్టమ్ డిప్రెషన్: ప్రసవం తర్వాత స్త్రీలలో సంభవించే రకం. అలసట.. విచారం.. అపరాధ భావం.. ఆసక్తి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి.

సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్: చలికాలంలో సూర్మరశ్మి తగ్గడం వల్ల నిర్దిష్ట సమయాల్లో కలిగే నిరశ.

డిప్రెషన్ కారణాలు

జీవ కారణాలు: హార్మోన్ల అసమతుల్యలత.. జన్యుపరమైన అంశాలు.. థైరాయిడ్ వంటి వైద్య సమస్యలు.

మానసిక కారణాలు: ఒత్తిడి.. ఆందోళన.. కష్టతర జీవన పరిస్థితులు వంటి ఇబ్బందులు.

ఆర్థోమాలిక్యులర్: రాగి.. ఫోలేట్స్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల రాగి విషతుల్యలత లేదా అండర్ మిథైలేష్ ఏర్పడి డిప్రెషన్ తీవ్రత పెరుగుతుంది.

ఏమేం సమస్యలు.?

- డిప్రెషన్ శారీరక.. మానసిక సమస్యలను కలిగిస్తుంది.

- నిద్రలేమి.. అలసట.. ఆకలి మార్పులు.. తలనొప్పి.. శరీర నొప్పులు.. జీర్ణ సమస్యలు.

- ఏకాగ్రత.. ప్రేరణ తగ్గడం వల్ల ఉత్పాదకత తగ్గుతుంది.

- తీవ్ర సందర్భాల్లో ఆత్మహత్య ప్రమాదం పెరుగుతుంది.

నివారణ ఎలా.?

- ఆరోగ్యకర జీవనశైలిని ఏర్పరచుకోవాలి. దీనికోసం నియమిత వ్యాయామం.. తగినంత విశ్రాంతి.. సమతుల ఆహారం.. సామాజిక కార్యకలాపాలు చేయాలి.

- ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి. మైండ్‌ఫుల్‌నెస్.. రిలాక్సేషన్ టెక్నిక్స్.. వ్యక్తిగత సమయం కేటాయించుకోవాలి.

- సపోర్ట్ నెట్వర్క్ అలవర్చుకోవాలి. బలమైన సామాజిక సంబంధాలును ఏర్పరచుకోవాలి.

- కుటుంబ చరిత్ర.. వైద్య సమస్యల గురించి తెలుసుకొని ముందస్తు చర్యలు చేపట్టాలి.

Next Story