- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ChatGPT : చాట్ జీపీటీ మనుషులను సోమరిపోతులను చేస్తుందా? సంచలన విషయాలు బయటపెట్టిన అధ్యయనం
చాట్ జీపీటీ వాడకం కామన్ అయిపోయింది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు.. తమ వర్క్‌లో ఎంతో కొంత మద్దతు కోసం దీన్ని వినియోగిస్తున్నారు. కానీ ఈ ఉపయోగం మనుషులను మరింత సోమరులుగా మారుస్తుందా?

దిశ, వెబ్‌డెస్క్ : చాట్ జీపీటీ వాడకం కామన్ అయిపోయింది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు.. తమ వర్క్‌లో ఎంతో కొంత మద్దతు కోసం దీన్ని వినియోగిస్తున్నారు. కానీ ఈ ఉపయోగం మనుషులను మరింత సోమరులుగా మారుస్తుందా? లేక బ్రెయిన్ పనితీరును మెరుగుపరుస్తుందా? అనే ప్రశ్న మొదలైంది. ఈ విషయం పైనే అధ్యయనం చేసిన పరిశోధకులు.. సంచలన విషయాలు బయటపెట్టారు.
ఎంఐటీ మీడియా ల్యాబ్ నిర్వహించిన స్టడీలో చాట్ జీపీటీ వాడకం మెదడు ఆలోచనా సామర్థ్యం, జ్ఞాపకశక్తి, నేర్చుకునే విధానంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశీలించింది. ఇందులో భాగంగా బోస్టన్ ప్రాంతానికి చెందిన 18–39 సంవత్సరాల వయస్సు గల 54 మందిని మూడు గ్రూపులుగా విభజించారు. ChatGPT గ్రూప్(రచనలో ChatGPTని ఉపయోగించేవారు), సెర్చ్ ఇంజన్ గ్రూప్(గూగుల్ సెర్చ్ చేసేవారు), బ్రెయిన్-ఓన్లీ గ్రూప్(ఓన్‌గా రాసేవారు)గా డివైడ్ చేశారు. SAT-స్టైల్ వ్యాసాలను మూడు సెషన్లలో రాయించి... మెదడు కార్యకలాపాలను EEG స్కాన్ల ద్వారా పరిశీలించారు. ఇక నాల్గవ సెషన్‌లో ChatGPT గ్రూప్ AI లేకుండా రాయగా.. బ్రెయిన్-ఓన్లీ గ్రూప్ ChatGPTని ఉపయోగించింది.
ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
* ChatGPT గ్రూప్‌లో సృజనాత్మకత, జ్ఞాపకశక్తి, అర్థం చేసుకోవడంతో సంబంధం ఉన్న న్యూరల్ కనెక్టివిటీ అతి తక్కువగా ఉంది.
* సెర్చ్ ఇంజన్ గ్రూప్ మధ్యస్థ స్థాయి కార్యకలాపం చూపించింది.
* ChatGPT వాడిన 83.3% మంది తమ వ్యాసాలను రాసిన కొన్ని నిమిషాల్లోనే సరిగ్గా గుర్తుచేసుకోలేకపోయారు. ఇది జ్ఞాపకశక్తి తక్కువగా ఉందని సూచిస్తుంది. రైటింగ్‌లో సోల్ లేదని.. ఓన్ చేసుకోలేదన్న విషయం అర్థమవుతుంది.
* ChatGPTపై అతిగా ఆధారపడటం వల్ల క్లిష్టమైన ఆలోచన, నేర్చుకునే సామర్థ్యం తగ్గాయి. ఈ ప్రభావం నాల్గవ సెషన్‌లో AI లేకుండా రాసినప్పుడు కూడా కనిపించింది.
* బ్రెయిన్-ఓన్లీ గ్రూప్ అత్యధిక న్యూరల్ కనెక్టివిటీ, సృజనాత్మకత, శాటిస్‌ఫాక్షన్‌ను చూపించింది.
* సెర్చ్ ఇంజన్ గ్రూప్ ChatGPT కంటే మెరుగైన ఫలితాలు ఇచ్చింది. సమాచారం కోసం సెర్చ్ చేయడం మెదడును ఎక్కువగా ఉత్తేజపరుస్తుందని తెలిపింది.
* ఇక నాల్గవ సెషన్‌లో బ్రెయిన్-ఓన్లీ గ్రూప్ ChatGPTని ఉపయోగించినప్పుడు న్యూరల్ కార్యకలాపం పెరిగింది. ఇది స్వతంత్ర ఆలోచన తర్వాత AIని ఉపయోగిస్తే నేర్చుకునే సామర్థ్యం మెరుగవుతుందని సూచిస్తుంది.
ChatGPT.. సోమరితనం?
* ChatGPTని ఎక్కువగా ఉపయోగిస్తే (ఉదా., AI రాసినవి కాపీ చేయడం), మెదడు కార్యకలాపం, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత తగ్గుతాయి.
* సొంతంగా ఆలోచించాక ఆలోచనలను మెరుగుపరచడానికి లేదా బ్రెయిన్‌స్టార్మింగ్‌కు ఉపయోగిస్తే.. నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది.
* మొత్తానికి ChatGPT ప్రభావం దాని వాడకంపై ఆధారపడి ఉంటుంది. నేర్చుకునేందుకు హెల్ప్ తీసుకుంటే ప్రయోజనం పొందుతారు. ఇన్‌స్టాంట్ సమాధానాల కోసం వాడితే సోమరులుగా మిగిలిపోతారు.






