ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన గుహలు ఏవో తెలుసా?

by Phanindra |

ప్రకృతిలోని అందమైన అద్భుతాల్లో కొండ గుహలు కూడా ఒకటి.

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన గుహలు ఏవో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: ప్రకృతిలోని అందమైన అద్భుతాల్లో కొండ గుహలు కూడా ఒకటి. అనాది కాలం నుంచి ఇప్పటి వరకు ఇవి మానవులకు, వివిధ జంతువులకు, వృక్ష జాతులకు ఉపయోగపడ్డాయి. ఆదిమ మానవులు గుహలను నివాసాలుగా, ప్రకృతి విపత్తుల నుంచి సంరక్షణకోసం వినియోగించుకున్నారు. సాంస్కృతిక, మతపరమైన వైభవాలకు కేంద్రంగా చరిత్రలో నిలిచిన గుహలు ఈరోజుల్లో వినోద కార్యకలాపాలకు, టూరిస్టు ప్రదేశాలుగా నిలుస్తున్నాయి. అయితే అదే సందర్భంలో గుహలు ఇరుకైన మార్గాలతో, సొరంగాలతో ప్రమాదకరమైనవిగాను, ప్రాణాంతక జంతువులకు నివాసంగాను ఇప్పటికీ ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుహలను అన్వేషించే క్రమంలో ఘోరమైన ప్రమాదాలు జరిగి పరిశోధకులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి ప్రమాదకరమైన గుహల గురించి తెలుసుకుందాం.

క్రుబేరా గుహ

జార్జియాలోని క్రుబేరా గుహను అనేక ట్రావెల్ సైట్‌లు అధికారికంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గుహగా పేర్కొంటున్నాయి. ఇది డజన్ల కొద్దీ గుహ డైవర్ల ప్రాణాలను బలిగొన్నదనే ట్రాక్ రికార్డును కలిగి ఉంది. దీనిని వోరోన్యా గుహ (Voronya Cave) కేవ్ అని కూడా పిలుస్తారు. మరో విషయం ఏంటంటే.. ఇందులోకి ప్రవేశించిన అన్వేషకులు ఎందుకు మరణించారో ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకో లేకపోయారు. అంతలోతుగా, భయంకరంగా ఉంటుందట ఈ గుహ. ప్రస్తుతం క్రుబేరా లేదా వోరోన్యా గుహలో ప్రవేశించేందుకు సాధ్యంకాని లోపలి భాగం దాదాపు 2,200 మీటర్లు (7,217 అడుగులు) ఉంటుందని పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో దాని ‘అట్టడుగు స్థాయికి’కి చేరుకోవడానికి రకరకాల ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ భూగర్భ వాయు పీడనానికి(underground air pressure) సంబంధించిన సమస్యలు, గుహకు ఉన్న భయంకరమైన ప్రత్యేకతల మూలంగా ప్రజలు దాని లోపలికి చివరి వరకు చేరుకోకుండా ప్రభుత్వం నిషేధించింది.

కితుమ్ గుహ

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ కితుమ్ గుహ ఆఫ్రికాలోని మౌంట్ ఎల్గాన్ నేషనల్ పార్క్‌లో ఉంది. ప్రమాదకరమైన జంతు జాతులకు నివాసంగా ఉందని ది సన్ యుఎస్ నివేదించింది. ఐదు ‘ఎలిపెంట్ కేవ్స్’లలో ఒకటైన కితుమ్ కేవ్ గుహ చరిత్రలో రెండు ప్రాణాంతక వ్యాధులైన ఎబోలా, మార్బర్గ్ వైరస్ వ్యాధికి మూలం కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఏనుగులు, గేదెలు, జింకలు, హైనాలు, చిరుతపులులతో సహా అనేక జంతువులకు వందలు, వేల సంవత్సరాలుగా ఈ గుహ నిలయంగా ఉందని, రాత్రిపూట గుంపులు గుంపులుగా అవి ఇందులోకి ప్రవేశిస్తాయని అట్లాస్ అబ్స్‌క్యూరా (Atlas Obscura) సైట్‌ పేర్కొన్నది. 1980లో ఇద్దరు వ్యక్తులు ఈ గుహలోకి వెళ్లి మార్బర్గ్ వైరస్ వ్యాధి బారిన పడి మరణించారు. దీంతో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ మెడికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ (USAMRIID) కు చెందిన పరిశోధకులు ఈ గుహను స్టడీ చేశారు. అయితే వారు గుహ లోపల నివసిస్తున్నట్లు భావించే వెక్టర్ జాతులను(vector species) గుర్తించలేకపోయారు. కానీ అక్కడ అనేక రకాల జంతు సమూహాలు నివసిస్తున్నట్లు మాత్రం గమనించారు. వీటితోపాటు ఇంకా అనేక ప్రమాదకరమైన గుహలు ప్రపంచంలో ఉన్నాయి.

నట్టి పుట్టి గుహ

అత్యంత ప్రమాదకరమైన గుహల్లో ఉటాలోని నట్టి పుట్టి గుహ(Nutty Putty Cave in Utah) కూడా ఒకటి. అన్వేషకుడు జాన్ జోన్స్ ఇందులో ప్రవేశించే క్రమంలో లోతైన ప్రదేశంలో ఇరుక్కుని మరణించాడు. దీంతో స్థానిక అధికారులు 2009 నుంచి ఈ గుహను మూసి వేశారు. ఇక అప్పటి నుంచి ఈ గుహలోకి ప్రవేశించేందుకు ఎవరూ సాహసించడం లేదు.

Next Story