- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral News: అమీర్ పేట్ బీటెక్ బాబులకు షాక్.. ఇకపై కోడింగ్ తో పనిలేదు.. Canva Code కొంపలు ముంచేస్తోంది
Viral News: బీటెక్ చదివిన ప్రతి విద్యార్థి సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం తప్పని సరిగా ఐటీ కోర్సుల కోసం హైదరాబాద్ లోని అమీర్ పేట్ చుట్టు తిరుగుతుంటారు.

దిశ, వెబ్ డెస్క్: Viral News: బీటెక్ చదివిన ప్రతి విద్యార్థి సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం తప్పని సరిగా ఐటీ కోర్సుల కోసం హైదరాబాద్ లోని అమీర్ పేట్ చుట్టు తిరుగుతుంటారు. వేలాది రూపాయలు చెల్లించిన సాఫ్ట్ వేర్ కోడింగ్ కోర్సు లు నేర్చుకుంటారు. ఈ కోడింగ్ ఆధారంగానే జాబ్స్ చాలా వరకూ ఉంటాయి. అయితే తాజాగా ఏఐ రంగ ప్రవేశంతో కోడింగ్ చేసేవారికి సవాలు విసురుతోంది.
ఒక కోడింగ్ చేసే ఉద్యోగికి సంవత్సరానికి రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ వేతనం చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఏఐ ద్వారా కోడింగ్ చేయించుకుంటే ఆ కంపెనీ సంవత్సరం సబ్ స్క్రిప్షన్ కోసం 200 నుంచి 500 డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది. కోడింగ్ క్షణాల్లో పూర్తయిపోతోంది. ఇఫ్పుడు సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాలు ఊడగొడుతున్న కోడింగ్ రంగంలోకి ఇప్పుడు మరో కంపెనీ అడుగు పెట్టింది. కాన్వ సంస్థ ఇప్పటికే ఫోటో, వీడియో రంగంలో ఏఐ ద్వారా సంచలనం సృష్టించింది. అలాంటి సంస్థ ఇప్పుడు ఏఐ కోడింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.
ఇకపై కోడింగ్ కోసం మనుషులతో పనిలేదని, తాము ఎలాంటి సాఫ్ట్ వేర్ కోడ్ కావాలంటే అది క్షణాల్లో రూపొందించి ఇస్తామని తెలిపారు. సాఫ్ట్ వేర్ రంగంలో వస్తున్న మార్పులతో ఇఫ్పటికే వేలాది మంది ఉద్యోగులకు లేఆఫ్స్ పేరిట ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. మరోవైపు ఉద్యోగులు సైతం ఏఐ కోర్సులు నేర్చుకుంటున్నారు. ఏఐ ద్వారా పని చేయాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్సులు నేర్చుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. అటు ఏఐ టెక్నాలజీతో ఒక వైపు ఉద్యోగాలు పోతాయిన కొందరు వాదిస్తుంటే, దీన్ని అవకాశంగా తీసుకొని ఏఐ టెక్నాలజీ నేర్చుకొని కొత్త ఉద్యోగాలు పొందవచ్చని మరికొందరు సూచిస్తున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.






