మామిడిపండ్లను విమానంలో తీసుకెళుతున్నారా? ఇది మర్చిపోకండి

by Ajay Maddhiboyina |

ఎర్రబ‌స్సులో ఏదైనా తీసుకువెళ్లొచ్చు కానీ ఎయిర్ బ‌స్సులో అదే... విమానంలో ఏది ప‌డితే అది తీసుకువెళ్ల‌డానికి వీలు కాదు. కొన్ని తినే, తాగే ప‌దార్థాల‌పై కూడా విమానాల్లో ఆంక్ష‌లు ఉంటాయి. అంతెందుకు ఆరోగ్యానికి మేలు చేసే పండ్ల‌పై కూడా ఆంక్ష‌లు ఉంటాయి.

మామిడిపండ్లను విమానంలో తీసుకెళుతున్నారా? ఇది మర్చిపోకండి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఎర్రబ‌స్సులో ఏదైనా తీసుకువెళ్లొచ్చు కానీ ఎయిర్ బ‌స్సులో అదే... విమానంలో ఏది ప‌డితే అది తీసుకువెళ్ల‌డానికి వీలు కాదు. కొన్ని తినే, తాగే ప‌దార్థాల‌పై కూడా విమానాల్లో ఆంక్ష‌లు ఉంటాయి. అంతెందుకు ఆరోగ్యానికి మేలు చేసే పండ్ల‌పై కూడా ఆంక్ష‌లు ఉంటాయి. ప్ర‌స్తుతం మామిడిపండ్ల సీజ‌న్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఎక్క‌డ చూసినా ఆ పండ్లే క‌నిపిస్తుంటాయి. తోట‌లు, చెట్లు ఉన్న‌వాళ్లు అయితే త‌మ బంధువుల‌కు, స్నేహితుల‌కు వీటిని స‌ప్లై చేస్తుంటారు. అయితే వీటిని మ‌న దేశంలో ఎక్క‌డికైనా తీసుకువెళ్లొచ్చు. కానీ విదేశాల‌కు విమానంలో తీసుకువెళ‌తామంటే మాత్రం రూల్స్ ఒప్పుకోవు. అన్ని దేశాలకు అని కాదు కానీ కొన్ని దేశాల‌కు మాత్రం మ్యాంగోల‌ను తీసుకువెళ్లడంపై క‌ఠిన నిబంధ‌న‌లు ఉన్నాయి.

విదేశీ వ్య‌వ‌సాయ నిబంధ‌న‌లు చాలా క‌ఠినంగా ఉండ‌టం వ‌ల్ల అనేక అంత‌ర్జాతీయ దేశాలు త‌మ దేశంలోకి తెగుళ్లు, కొత్త‌ర‌కం వ్యాధులు వ్యాపించ‌కుండా నిరోధించ‌డానికి ఈ నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల‌లో వ్య‌వ‌సాయ దిగుమ‌తుల‌పై అత్యంత క‌ఠ‌ఠిన‌మైన నిబంధ‌న‌లు ఉన్నాయి. కాబ‌ట్టి ఈ దేశాల్లోకి మామిడిపండ్ల‌ను అనుమ‌తించేముందు వాటిపై ఏమైనా తెగుళ్లు ఉన్నాయా.. బ్యాక్టిరియా ఉంటే వాటిని నిర్మూలించ‌డానికి ఇర్రేడియేష‌న్ చికిత్స చేస్తారు. కాబ‌ట్టి మీరు ఒకేవేళ విదేశాల‌కు మామిడిపండ్ల‌ను తీసుకువెళ్లాలి అనుకుంటే క‌స్ట‌మ్స్ మార్గ‌ద‌ర్శ‌కాలు మాత్రం ప‌క్కా చూసుకోవాల్సిందే.

Next Story