మాజీ లవర్‌తో కనెక్ట్ అవడం కరెక్టేనా? ఇద్దరిలో రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంటే.. ఏంటి సంగతి?

by Bhoopathi Nagaiah |

మీరు మీ భాగస్వామితో ఈ మధ్యే విడిపోయారు. కానీ ఇన్నాళ్లు లైఫ్‌లో బిగ్ పార్ట్‌గా ఉన్న వ్యక్తితో సడెన్‌గా రిలేషన్ కట్ చేయడమంటే కష్టమే.

మాజీ లవర్‌తో కనెక్ట్ అవడం కరెక్టేనా? ఇద్దరిలో రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంటే.. ఏంటి సంగతి?
X

దిశ, ఫీచర్స్: మీరు మీ భాగస్వామితో ఈ మధ్యే విడిపోయారు. కానీ ఇన్నాళ్లు లైఫ్‌లో బిగ్ పార్ట్‌గా ఉన్న వ్యక్తితో సడెన్‌గా రిలేషన్ కట్ చేయడమంటే కష్టమే. ప్రత్యేకించి రొమాంటిక్ రిలేషన్‌షిప్ అయితే.. ఆ వ్యక్తితో మానసిక, శారీరక సాన్నిహిత్యాన్ని వదులుకోవడం కష్టం అవుతుంది. కానీ ఆ పార్టనర్ వల్ల ఇబ్బంది పడితే.. పరిస్థితి మరోలా ఉంటుంది. ఆ బంధాన్ని ఎప్పుడెప్పుడు తెంచుకుని బయటపడతామా అనే ఆలోచన ఉంటుంది. అలాంటప్పుడు సదరు వ్యక్తితో ఫ్యూచర్‌లో స్నేహాన్ని కొనసాగించడాన్ని కష్టంగా భావిస్తారు. అంటే ఎక్స్‌తో ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ చేయడం అనేది వ్యక్తిని, పరిస్థితిని బట్టి మారుతుండొచ్చు. కాబట్టి మాజీ భాగస్వామితో స్నేహం కొనసాగించాలా వద్దా అని నిర్ణయించుకునేటప్పుడు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎప్పుడు మంచిది.. ఏ సందర్భంలో కాదు.. అనే విషయాల గురించి వివరిస్తున్నారు.

కొన్నిసార్లు గత సంబంధాలు భవిష్యత్ ఆనందానికి ఆటంకం కలిగించేలా ఉంటాయి. అదే సందర్భంలో వెనుకకు వెళ్లడం ముందుకు సాగడానికి సహాయపడుతుంది. మునుపటి సంబంధాన్ని ఆదర్శంగా తీసుకుని తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఆ సంబంధంలోని స్నేహాన్ని తిరిగి సందర్శించడం, ఆస్వాదించడం ప్రస్తుత బాధలను పరిష్కరించేందుకు సహాయపడుతుంది. అయితే మరికొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నాయాన్ని కనుగొనలేకప్పుడు, మరొకరితో డేటింగ్‌కు వెళ్లలేనప్పుడు.. ఎక్స్‌ గుర్తుకు రావచ్చు. కానీ మీరు కలిసి ఉన్నప్పుడు ఫేస్ చేసిన టాక్సిక్, నెగెటివ్ ఎమోషన్స్ రీకాల్ చేసుకున్నప్పుడు ఇది కరెక్ట్ కాదని అనిపించవచ్చు.

ఎప్పుడు గుడ్?

* ఒకరిపై మరొకరికి రొమాంటిక్ ఫీలింగ్స్ లేనప్పుడు ఎక్స్‌తో ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ చేయొచ్చు. ప్లాటోనిక్ రిలేషన్ కలిగి ఉండవచ్చు. స్నేహితుడిగా పరిగణించవచ్చు.

* ఇద్దరి లక్ష్యాలు ఒకటే అయినప్పుడు.. ఒకరి మద్దతు మరొకరికి అవసరం అవుతుంది. ఇద్దరిలోనూ ఎలాంటి నెగెటివ్ వైబ్స్ లేనప్పుడు.. రియల్ ఫ్రెండ్స్‌గా ఉండటం మంచిదే.

* మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో విడిపోయినప్పుడు.. ఒకరి బాధలు, ఆనందాలు మరొకరికి తెలిసినప్పుడు.. ఆ క్రమంలో సపోర్ట్ ఉన్నప్పుడు.. ఎక్స్‌తో ఫ్రెండ్‌షిప్ పాజిటివ్‌ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది.

* ఇద్దరు బ్రేకప్‌ను ప్రాసెస్ చేశారు. ఒకరిపట్ల మరొకరికి ఎలాంటి అన్‌రిజాల్వ్‌డ్ ఫీలింగ్స్ లేవు. మూవ్ ఆన్ అయ్యారు. మరొకరిని పార్టనర్‌గా ఎంచుకున్నారు. అలాంటప్పుడు స్నేహితులుగా మారడం.. ప్రజెంట్ రిలేషన్స్‌పై ఎలాంటి ఎఫెక్ట్ పడదు.

* ఎమోషనల్ బ్యాగేజ్ లేదా ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా సపోర్టివ్ ఫ్రెండ్‌షిప్ కొనసాగించడానికి మానసికంగా పరిణతి చెందినట్లయితే బెటర్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

ఎప్పుడు బ్యాడ్?

* మీ ఎక్స్ మిమ్మల్ని దుర్భాషలాడినప్పుడు, హానికారకంగా మారినప్పుడు స్నేహం పనికిరాదు.

* ఇద్దరు ఒకరినొకరు మోసం చేసుకున్నప్పుడు, తీవ్రంగా గాయపరుచుకున్నప్పుడు.. మళ్లీ కలవాలనే థాట్ పరిస్థితిని మరింత దిగజార్చొచ్చు.

* మీ మాజీకి మీ పట్ల ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయని మీకు తెలుసు కానీ మీరు అలా ఆలోచించనప్పుడు ఫ్రెండ్ షిప్ ఆలోచనే వద్దు.

* లోన్లీగా ఫీల్ అవుతున్నారు. కంఫర్ట్, అటెన్షన్ కావాలని అనుకుంటున్నారు. కానీ ఎదుటి వ్యక్తికి అలాంటి ఆలోచన ఉండకపోవచ్చు.

* మీరు ఆ బంధానికి ముగింపు పలికారు. ఆ వ్యక్తి లేకుండా బాగానే ఉన్నారని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. ఎక్స్‌ను ఫ్రెండ్‌గా యాక్సెప్ట్ చేయడం బ్యాడ్ ఐడియా.

* మీరు లేకుండా వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు.. మళ్లీ స్నేహం జోలికి పోరాదు.

ఎంతకాలం వెయిట్ చేయాలి?

మీరు మీ భాగస్వామితో ఇప్పుడే విడిపోయినట్లయితే.. స్నేహితులుగా ఉండటానికి ప్రయత్నించేందుకు కొంత టైమ్ వెయిట్ చేయాలా అని ఆలోచిస్తుంటారు.

కానీ మీ సంబంధాన్ని ఆదర్శవంతంగా మార్చేందుకు సరైన సమయం అంటూ ఉండదు. ఇది ఆ వ్యక్తితో రిలేషన్‌షిప్, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకు మీరు కొద్దికాలమే రిలేషన్‌లో ఉన్నప్పుడు..మానసికంగా దగ్గర కాకపోవచ్చు. దీంతో మీ ఎక్స్‌పట్ల హార్డ్ ఫీలింగ్స్‌ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఈజీగా స్నేహం చేయగలుగుతారు. మరోవైపు మీరు, మీ పార్టనర్‌ తీవ్రమైన దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నారు. కానీ అది వర్క్ కాలేదు. ప్రత్యేకంగా అది బ్యాడ్ బ్రేకప్ అయితే.. ఎమోషన్స్ ప్రాసెస్ చేయడానికి, మరిచిపోవడానికి ఇద్దరికీ కొంత సమయం పట్టవచ్చు. అలాంటప్పుడు స్నేహంగా కొనసాగేందుకు ఎక్కువ టైమ్ పడుతుంది.

Next Story