Foods : రుచిలోనే కాదు, ఔషధ గుణాల్లోనూ క్యాబేజీ సూపర్!

by Javid Pasha |

Foods : రుచిలోనే కాదు, ఔషధ గుణాల్లోనూ క్యాబేజీ సూపర్!

Foods : రుచిలోనే కాదు, ఔషధ గుణాల్లోనూ క్యాబేజీ సూపర్!
X

దిశ, ఫీచర్స్ : మన ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన పోషకాలు గల కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. క్యాబేజీ పలావ్, క్యాబేజీ ఫ్రై, క్యాబేజీ చట్నీ, క్యాబేజీ బజ్జీలు.. ఇలా ఎన్నో రకాల వంటల తయారీలో ఉపయోగిస్తుంటారు. అయితే ఒకప్పుడు దీనిని అనారోగ్యాలను దూరం చేసే పలు ఔషధాల తయారీలోనూ దీనిని ఉపయోగించేవారని మీకు తెలుసా? 17వ శతాబ్దంలోనే పలు దేశాల్లో ఇది మఖ్యమైన ఆహారాల్లో భాగంగా ఉండేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం క్యాబేజీని అధికంగా ఉపయోగించడంతోపాటు దానిని ఎక్కువగా పండిస్తున్న దేశాల్లో చైనా మొదటిస్థానంలో ఉందని చెబుతారు. ప్రపంచంలోనే క్యాబేజీ 48% క్యాబేజీ ఉత్పత్తి కేవలం చైనాలోనే జరుగుతోందట.

క్యాబేజీని తినడానికి మాత్రమే కాకుండా వేల సంవత్సరాల క్రితం ఆయుర్వేదిక్ ఔషధంగా ఉపయోగించారని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చైనా, జపాన్ దేశాల్లో బట్టతలకి చికిత్సలో వాడేవారట. అంటే క్యాబేజీతో తయారు చేసిన ఔషధం లేదా నూనె వంటి పదార్థం తలకు పట్టించడంవల్ల బట్టతల సమస్య సమసిపోతుందని, జుట్టు రాలిపోవడం ఆగిపోతుందని అప్పట్లో నమ్మేవారు. అలాగే పొడవాటి జుట్టుకోసం మహిళలు సైతం క్యాబేజీ తినాలని అప్పట్లో పెద్దలు సూచించేవారు. ఇప్పటికీ క్యాబేజీ ఆరోగ్యానికి మంచిదని అందరూ అంగీకరిస్తారు. అలాగే క్యాన్సర్ నివారణకు కావాల్సిన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా లివర్ సమస్యలను, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను కూడా క్యాబేజీ అడ్డుకుంటుందని చెబుతారు. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటంవల్ల అధిక బరువు, ఊబకాయం సమస్యలు దూరం అవుతాయి. బాలింతల్లో తల్లిపాలు పెరగడానికి క్యాబేజీ మంచి ఆహారం. అలాగే దగ్గు, కఫం వంటి సమస్యలను దూరం చేయడంలో, రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ శక్తిని మెరుగు పర్చడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ క్యాబేజీ బెస్ట్ ఫుడ్ అంటున్నారు నిపుణులు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ‌’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story