Neuro health : పదే పదే అదే ఆలోచన.. మెదడును ఎలా ప్రభావితం చేస్తుంది?

by Javid Pasha |

నాడీ మార్గాలు మెదడు ఆలోచనలు, భావోద్వేగాలు, అలవాట్లను మేనేజ్ చేయడంలో కీ రోల్ పోషిస్తాయి.

Neuro health : పదే పదే అదే ఆలోచన.. మెదడును ఎలా ప్రభావితం చేస్తుంది?
X

దిశ, ఫీచర్స్ : ఒక విషయాన్ని మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తూ ఉంటే.. చివరకు అదే నిజమనే భ్రమపడే అవకాశం లేకపోలేదు అంటుంటారు నిపుణులు. న్యూరో సైన్స్ అధ్యయనాలు కూడా అదే చెబుతున్నాయి. మానవ మెదడు ఒక రిపిటేషన్ మెషిన్‌లా పనిచేస్తుందని పేర్కొంటున్నాయి. అది నిజమా.. అబద్ధమా అనేదానితో సంబంధం లేకుండా మనం ఏ ఆలోచనను ఎక్కువసార్లు రిపిటేషన్ చేస్తుంటామో.. అది నిజమైనదిగా మెదడు గ్రహిస్తుందని స్పష్టం చేస్తున్నాయి.

న్యూరో ప్లాస్టిసిటీ ప్రాసెస్

పదే పదే వచ్చే ఆలోచన లేదా పునరావృత్తి చేసుకునే విషయాలను అవి అబద్ధమైనా సరే.. మెదడు గ్రహించడం, నిజమైనవిగా భావించడమనేది న్యూరో ప్లాస్టిసిటీ (neuroplasticity) అనే మెదడు ప్రక్రియ ద్వారా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మెదడు ఆలోచనలు, అనుభవాలు, ప్రవర్తనలకు అనుగుణంగా తన స్ట్రక్చర్‌ను, ఫంక్షన్‌ను మార్చుకుంటుంది. అంటే న్యూరోప్లాస్టిసిటీ అంటే ఇక్కడ మెదడు న్యూరల్ కనెక్షన్లను ఏర్పర్చడం, మార్చడం, బలపర్చడం ద్వారా ఆలోచనలను అనుకూలంగా మల్చుకుంటుంది(Customizable). ఉదాహరణకు రిపిటేటివ్ థాట్స్ సినాప్టిక్ కనెక్షన్లను బలపరుస్తాయి. కొత్త న్యూరాన్‌లను సృష్టిస్తాయి. ఆలోచనలు మరింత వేగంగా, సులభంగా ఫ్లో అయ్యేలా చేస్తాయి. ఇది బ్రెయిన్ అడాప్టివ్ స్ట్రక్చరల్, ఫంక్షనల్ మార్పులను కలిగించడం ద్వారా జీవితకాలం కొనసాగుతుంది.

నాడీ మార్గాల్లో మార్పులు

నాడీ మార్గాలు (neural pathways) మెదడు ఆలోచనలు, భావోద్వేగాలు, అలవాట్లను మేనేజ్ చేయడంలో కీ రోల్ పోషిస్తాయి. కాబట్టి రిపిటేటివ్ థాట్స్ ద్వారా, నమ్మకాల ద్వారా పాత్‌వేలు బలపడతాయి. హెబ్‌బియన్ థియరీ(Hebbian theory) ప్రకారం.. ఒకే సమయంలో ఫైర్ అయ్యే న్యూరాన్‌లు కలిసి వైర్ అవుతాయి. అంటే ఒకే విషయాన్ని ఎక్కువసార్లు ఆలోచిస్తే అందుకు సంబంధించిన నాడుల మధ్య కనెక్షన్‌లు బలపడి, ఆ ఆలోచన మరింత సహజంగా, ఆటోమేటిగ్గా అనిపిస్తుంది. ఇది నెగెటివ్ సెల్ఫ్-టాక్ (negative self-talk) వంటివి కూడా నిజమైనవిగా అనిపించేలా చేస్తుంది. ఎందుకంటే.. పునరావృత్తి ద్వారా మెదడు ఆ నాడులను బలవంతం చేసి, ఒత్తిడి పెంచి భావోద్వేగాలు, విశ్వాసాలు, అలవాట్లను ఏర్పరుస్తుంది.

బయపటడేదెలా?

కాగ్నెటివ్ బిహేవియరల్ సైకాలజీ (cognitive behavioral psychology) ప్రకారం.. ఇలాంటి రిపిటేషన్ అనేది మెదడు ప్లాస్టిసిటీని ఉపయోగించి, బలమైన మానసి గాయాల నుంచి కోలుకునేలా చేయడానికి లేదా పాజిటివ్ మార్పులు తీసుకురావడానికి సహాయపడుతుంది. అంటే నెగెటివ్ ఆలోచనలు మీలో తరచుగా పునరావృతం అవుతుంటే కూడా అవి నిజమైనవిగా మారుతాయని, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు దారితీస్తాయని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాటి నుంచి బయటపడాలంటే.. పాజిటివ్ ఆలోచనలను పునరావృత్తి చేయడం ద్వారా సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఈ పరిస్థితి మెదడు కొత్త నాడీ మార్గాలను ఏర్పరిచి, పాతవాటిని బలహీన పరుస్తుంది. కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీలో ఈ విధానాన్నే అనుసరిస్తారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story