Relationship: ఈ రంగు రాళ్ళు మీ దగ్గర ఉంటే మీ లవర్ మిమ్మల్ని ఎప్పుడూ వదలదు

by Vennela |

Relationship: మానవ జీవితం ప్రకృతికి ముడిపడి ఉంటుంది.

Relationship: ఈ రంగు రాళ్ళు మీ దగ్గర ఉంటే మీ లవర్ మిమ్మల్ని ఎప్పుడూ వదలదు
X

దిశ, వెబ్ డెస్క్: Relationship: మానవ జీవితం ప్రకృతికి ముడిపడి ఉంటుంది. ప్రకృతిలోని ఎన్నో అవశేషాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనవి రత్నాలు, స్ఫటికాలు అని చెప్పవచ్చు. వీటిని ధరించినట్లయితే భౌతిక రసాయన లక్షణాలు మన జీవితంపై ఎంతో ప్రభావితం చూపిస్తాయని పండితులు చెబుతున్నారు. అలాంటి లక్షణాలు కలిగిన స్పటికాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. . వీటిని ధరించడం ద్వారా మీ జీవితంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. ఏ స్పటికం ధరిస్తే ఎలాంటి మార్పులు మీ జీవితంలో కలుగుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చంద్రకాంతి స్ఫటికం(Moonstone)

చంద్రకాంతి స్పటికం ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక నూతన ప్రారంభానికి సూచికగా నిలుస్తుంది. దీనిని స్నానం చేసే సమయంలో కానీ ధ్యానం చేసే సమయంలో కానీ జంటలు వాడినట్లయితే వారిద్దరి మధ్య మానసిక బంధం దృఢంగా మారుతుంది.

గులాబీ స్ఫటికం (Rose Quartz)

జంటల మధ్య ప్రేమను చిగురింప చేయడానికి ఈ స్పటికం ఎంతో ఉపయోగపడుతుంది నిస్వార్ధమైన ప్రేమకు క్షమాగుణానికి అనురాగానికి ఈ పట్టికం ఒక చిహ్నం నిద్రపోయేటప్పుడు మంచం పక్కన ఈ స్పటికాన్ని పెట్టుకున్నట్లయితే దంపతుల మధ్య ప్రేమ అభివృద్ధి చెందుతుంది.

స్ఫటికం (Clear Quartz)

స్పష్టమైన పారదర్శకమైన స్పటికం మీ మనసును సూచిస్తుంది. జంటల మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగేందుకు స్పష్టమైన పారదర్శకమైన అవగాహన పెరిగేందుకు ఈ స్పటికం ఎంతో ఉపయోగపడుతుంది. దంపతుల మధ్య పొరపు చాలు తొలగిపోవాలంటే ఈ స్పటికాన్ని వారి బెడ్రూంలో ఉంచుకుంటే మంచిది.

అమెథిస్ట్ క్రిస్టల్ (Amethyst)

ప్రశాంతతకు, ఆత్మీయతకు ఇది చిహ్నం. దంపతుల మధ్య అవగాహన పెంచేందుకు ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా జంటలు విశ్రాంతి తీసుకునే సమయంలో దీని దగ్గర ఉంచుకుంటే మంచిది

రక్తమణి (Garnet)

ఉత్సాహానికి, ఉద్వేగానికి, నిబద్ధతకు రక్తమణి ఒక చిహ్నంగా చెప్పవచ్చు. ఎర్రటి రంగులో మెరిసే ఈ క్రిష్టల్ సమీపంలో జంటలు సేద తీరినట్లయితే, వారి మధ్యలో ఆత్మీయ అనుబంధం మరింత పెరుగుతుంది.

పింక్ శిలా (Rhodonite)

జంటల మధ్య బంధం బలహీనంగా ఉన్నప్పుడు ఇది వారి మధ్య భావోద్వేగ సమతుల్యత పెంచేందుకు ఉపయోగపడుతుంది. కష్ట సమయంలో ఈ స్పటికం క్షమాగుణాన్ని కలిగేలా చేస్తుంది. జంటల మధ్య ప్రేమను చిగురించేలా చేస్తుంది.

నీలం క్రిస్టల్ (Lapis Lazuli)

ఇద్దరు వ్యక్తుల మధ్య నిజాయితీగల సంభాషణ కోసం ఈ నీలం క్రిస్టల్ ఒక చక్కటి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. జంటల మధ్య మనస్పర్ధలు ఏర్పడినప్పుడు నీలం క్రిస్టియన్ అనేది వారిని కలిపేందుకు ఉపయోగపడుతుంది.

Next Story