- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral News: ఓరిని ట్విస్ట్ తగలయ్య..పెళ్లి పీఠల పై సడన్ గా వధువు తల్లి.. వరుడు ఏం చేశాడో మీరే చూడండి
Viral News: పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాడు. తనకు నచ్చిన అమ్మాయితో పెళ్లి జరగబోతున్నందుకు సంతోషించాడు.

దిశ, వెబ్ డెస్క్: Viral News: పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాడు. తనకు నచ్చిన అమ్మాయితో పెళ్లి జరగబోతున్నందుకు సంతోషించాడు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత ముసుగు తీసి చూశాడు. అక్కడున్న వ్యక్తి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సోషల్ మీడియాలో కనిపించే వార్తల్లో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ కు సంబంధించినవే ఉంటాయి. నేరాల దగ్గర నుంచి వింత వింత సంఘటనల వరకు ఉత్తరప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారింది.
తాజాగా యూపీలోని మీరట్ లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన మరకు వింతగా వినిపించినా..నవ్వు తెప్పిస్తుంది. కానీ బాధితుడి బాధ చూస్తే మాత్రం జాలి వేస్తుంది. తనకు జరిని మోసం పగవాడికి కూడా రావద్దని అంటున్నాడు. పోలీసులకు కూడా తనకు జరిగిన దారుణమైన మోసంపై కంప్లైయింట్ చేశాడు. ఇంతకీ అతగాడికి జరిగిన మోసం గురించి తెలుసుకుందాం.
మీరట్ లోని బ్రహ్మపురికి చెందిన మహ్మద్ అజీంకు శామలీ జిల్లా వాసి మంతశాతో పెళ్లి నిశ్చయమైంది. నిఖాలో మౌల్వీ వధువు పేరు తాహిరా అని పలకడంతో వరుడికి అనుమావనం వచ్చింది. ముసుగు తొలగించి చూస్తే..మంతశాకు బదులుగా భర్త మరణించిన ఆమె తల్లి వధువుగా ఉంది. ఈ పెళ్లికి వరుడి తరపున పెద్దలుగా వ్యవహరకించిన అతని అన్నావదినలు వధువు కుటుంబంతో కుమ్మక్కయ్యారు. గొడవ చేస్తే రేప్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని వారిద్దరూ అజీంను బెదిరించారు. తాను పూర్తిగా మోసపోయానని గ్రహించిన అజీం పెళ్లికి రూ. 5 లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.






