Boys: అమ్మాయిలు ఇష్టపడాలంటే.. అబ్బాయిలకు ఈ అలవాట్లు ఖచ్చితంగా ఉండాలి!

by Disha Web Desk 10 |
Boys: అమ్మాయిలు ఇష్టపడాలంటే.. అబ్బాయిలకు  ఈ అలవాట్లు ఖచ్చితంగా ఉండాలి!
X

దిశ, వెబ్ డెస్క్ : అందమైన అమ్మాయి అనగానే మనకి గుర్తుకువచ్చేది.. గర్ల్ ఫ్రెండ్. అబ్బా.. మన జీవితంలో కూడా మనస్సుకి నచ్చిన అమ్మాయి ఉంటే బావుండని కొంత మంది అబ్బాయిలు ఫీల్ అవుతుంటారు. మరి ఇంత వరకు మీతో ఏ అమ్మాయి స్పెండ్ చేయలేదా ? ఏ అమ్మాయి మీతో ఫ్రెండు లాగా మాట్లాడలేదా? బాధ పడకండి.. అమ్మాయి మీతో స్నేహం చేయకపోయిన ..మనతో స్నేహం చేసేలా మనమే చేద్దాం. అదేలాగా అని ఆలోచిస్తున్నారా? మీరు ఏ అమ్మాయితో అయితే స్నేహం చేయాలనుకుంటున్నారో ఆ అమ్మాయిని 7 రోజులు చూస్తూ ఉండండి. ఆ తర్వాత అమ్మాయిలకు నచ్చేలా కొంచం మారండి. ఇక్కడ దీని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం.

1. అమ్మాయిలు , అబ్బాయిల్లో మొదటిగా చూసే విషయం ఏదైనా ఉంది అంటే అది డ్రెస్సింగ్ స్టైల్. ఎక్కువ ఖర్చు పెట్టి బ్రాండెడ్ డ్రస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా 300 రూపాయల టీ షర్ట్ , 700 రూపాయల ప్యాంటు ధరించి స్మార్ట్ గా రెడీ అయి అదిరిపోయేలుక్ ఇవ్వచ్చు.

2. ఒక అమ్మాయి మిమల్ని చూడాలంటే మీలో ఒక అట్రాక్టీవ్ టాలెంట్ ఉండాలి. అంటే మీరు మంచిగా గిటార్ వాయించడం లేదా బైక్ రైడ్ చేయడం కానీ ఇలా ఒక కొత్త హ్యాబిట్ ను ఒకటి నేర్చుకోండి. ఇక్కడ మనం తెలుసుకోవాలిసిన విషయం ఏంటంటే ఏదైనా మనం ఫోకస్ చేస్తేనే వీటిని ఈజీగా నేర్చుకోవచ్చు. ఇలాంటివి మనలో ఉంటే మనం ఏ అమ్మాయితో మాట్లాడకపోయిన , పరిచయం లేకపోయిన మనం ఇంట్రస్టింగ్ గా కనిపిస్తుంటాము. ఇంకా మనకి అట్ట్రాక్ట్ అవుతారు.

3. మీరు మంచి స్నేహితులతోనే స్నేహం చేయాలి. వీళ్ల సపోర్ట్ ఉంటె ఏ విషయాన్ని భయపడకుండా మీరు కాన్ఫిడెంట్‌గా మీరు చెప్పాలనుకున్నది చెప్పగలుగుతారు. కాబట్టి మంచి స్నేహితులను మెయింటైన్ చేయండి.

4. మీరు స్నేహం చేసే అమ్మాయి వేరే స్నేహితులతో గడిపేటప్పుడు.. ఆ సమయంలో ఆమెను కలవకుండా అక్కడి నుంచి వెళ్లిపోండి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు దూరంగా ఉండడమే మంచిది.



Next Story

Most Viewed