‘డోంట్ స్టాప్ మీ నౌ’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన రోబోట్స్.. కళా రంగాన్ని సైతం టెక్నాలజీ ఆక్రమిస్తుందా?

by Javid Pasha |

‘డోంట్ స్టాప్ మీ నౌ’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన రోబోట్స్.. కళా రంగాన్ని సైతం టెక్నాలజీ ఆక్రమిస్తుందా?

‘డోంట్ స్టాప్ మీ నౌ’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన రోబోట్స్.. కళా రంగాన్ని సైతం టెక్నాలజీ ఆక్రమిస్తుందా?
X

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే అద్భుతాలు చేస్తోంది. పలు సెక్టార్లలో ఏఐ రోబోట్స్ కీ రోల్ పోషిస్తున్నాయి. సంచలనాకు కేరాఫ్‌గా మారుతున్నాయి. రీసెంట్‌గా అమెరికాస్ గాట్ టాలెంట్ (AGT) షోలో జరిగిన మరో అద్భుత దృశ్య సంఘటన అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ‘డోంట్ స్టాప్ మీ నౌ’ అనే పాటకు బోస్టన్ డైనమిక్స్ రోబోట్స్ అచ్చం మనుషుల్లా హావ భావాలొలికిస్తూ, డ్యాన్స్ చేస్తూ సంచలనం సృష్టించాయి. దీనిపై ఓ వైపు ప్రశంసలు కురుస్తున్నప్పటికీ, మరోవైపు ఏఐ సాంకేతికత చివరికి కళారంగాన్ని సైతం ఆక్రమించేలా ఉందనే ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో డ్యాన్సులు ఆకట్టుకోవడం, అలరించడం కొంత్తేం కాదు. కానీ, ఏఐ ఆధారిత రోబోటిక్ మెషిన్లు కూడా మొట్టమొదటిసారిగా సమకాలీన నృత్యం(Contemporary dance)తో ఇచ్చిన ప్రత్యక్ష ప్రదర్శనే ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తోంది. ఈ రోబోట్‌లు పర్‌ఫెక్ట్ కో ఆర్డినేషన్‌తో కదలడం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఈ షో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అద్భుతమైన సామర్థ్యాన్ని కనబరిచినప్పటికీ, సంగీతం, నృత్యం వంటి సృజనాత్మక రంగాలలో రోబోలు, యంత్రాల పాత్రపై చర్చను రేకెత్తించింది. చివరికి ఏఐ ఆధారిత రోబోటిక్స్ మానవ సృజనాత్మకతను, కళ రూపాలను కూడా ఆక్రమిస్తాయనే ఆందోళనలు సైతం పలువురు వ్యక్తం చేస్తుండగా, అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Link

Next Story