బ్లడ్‌లో ఆక్సిజన్ తగ్గితే ప్రాణహాని.. ఈ ఫ్రూట్స్ తీసుకుంటే సేఫ్..

by Disha Web Desk 10 |
బ్లడ్‌లో ఆక్సిజన్ తగ్గితే ప్రాణహాని.. ఈ ఫ్రూట్స్ తీసుకుంటే సేఫ్..
X

దిశ, ఫీచర్స్: అనారోగ్యంతో మరణించేందుకు గల కారణాల్లో బ్లడ్‌లో ఆక్సిజన్ లెవల్స్ తగ్గడం కూడా ఒకటి. అయితే ఎక్కువ మొత్తంలో తగ్గినప్పుడు మాత్రమే ప్రాణహాని సంభవిస్తుంది. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఆల్కలీన్ కంటెంట్ కలిగిన పండ్లు, ఆహారాలు తీసుకోవాలని.. రక్తంలో ఆక్సిజన్ తగ్గకుండా సహాయపడతాయని చెప్తున్నారు నిపుణులు.

నిమ్మకాయ శరీరానికి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలోనేగాక జీర్ణక్రియ సమస్యలను నివారించడంలో కీలకంగా పనిచేస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోకుండా తోడ్పడుతుంది. అవసరమైన శక్తిని అందిస్తుంది. అలాగే మామిడి, బొప్పాయి పండ్లు కూడా బ్లడ్‌లో ఆక్సిజన్ లెవల్స్ పెరిగేలా చేస్తాయి. కిడ్నీలను శుభ్రపర్చడంలోనూ దోహదపడతాయి. పైనాపిల్, ఎండుద్రాక్ష, బేరి పండ్లలో pH స్థాయి 8.5 వరకు ఉంటుంది. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆక్సిజన్ లెవల్స్‌ను పెంచుతాయి. వీటితోపాటు అరటిపండ్లు, ఖర్జూరాలు, క్యారెట్ రక్తంలో ఆక్సిజన్ పడిపోకుండా చూస్తాయి. కాబట్టి తరచూ వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

పుచ్చకాయను షుగర్ పేషెంట్లు తినకూడదు.. ఎందుకో తెలుసా?


Next Story

Most Viewed