పుచ్చకాయను షుగర్ పేషెంట్లు తినకూడదు.. ఎందుకో తెలుసా?

by Disha Web Desk 10 |
పుచ్చకాయను షుగర్ పేషెంట్లు తినకూడదు.. ఎందుకో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: పుచ్చకాయ తింటే అధిక బరువు తగ్గుతారా? డయాబెటిస్ పేషెంట్లు తినకూడదా? అంటే.. అవుననే అంటున్నారు ఆహార నిపుణులు. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి6, బీటా కెరోటిన్, మెగ్నీషియం, లైకోపీన్, పొటాషియం పుష్కలంగా ఉండటం మూలంగా వెయిట్‌లాస్‌కు కారణం అవుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. ఇతర విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుచ్చకాయలో పుష్కలంగా ఉంటాయి. వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం మూలంగా సమ్మర్‌లో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. వేడి వాతావరణం నుంచి తలెత్తే సమస్యలను నివారిస్తుంది. విటమిన్ ఎ, సి, పొటాషియం కలిగిన వాటర్ మిలన్ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. హై బీపీని నియంత్రిస్తుంది. అయితే సమ్మర్‌లో మాత్రమే పండే పుచ్చకాయల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటంతో.. బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరిగేందుకు కారణం అవుతుంది కాబట్టి డయాబెటిస్ బాధితులు తినకూడదని నిపుణులు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

బ్లడ్‌లో ఆక్సిజన్ తగ్గితే ప్రాణహాని.. ఈ ఫ్రూట్స్ తీసుకుంటే సేఫ్.



Next Story

Most Viewed