- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లివర్ హెల్త్‌కు కాఫీ.. కానీ తీసుకోవాల్సిన విధానం ఇది...
ఉదయం కాఫీ తాగడం ఒక అలవాటు మాత్రమే కాదు కాలేయాన్ని సంరక్షించే సులభమైన మార్గాల్లో ఒకటిగా ఉందని చెప్తున్నారు నిపుణులు. కాఫీ కాలేయంలో..
దిశ, ఫీచర్స్ : ఉదయం కాఫీ తాగడం ఒక అలవాటు మాత్రమే కాదు కాలేయాన్ని సంరక్షించే సులభమైన మార్గాల్లో ఒకటిగా ఉందని చెప్తున్నారు నిపుణులు. కాఫీ కాలేయంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. ఈ కొవ్వు కారణంగా ఏర్పడే మంట, మచ్చలు లేకుండా చేస్తూ.. సిర్రోసిస్ అని పిలువబడే లివర్ డిసీజ్‌ను నిరోధిస్తుంది. సిర్రోసిస్ అనేది కొవ్వు కాలేయ వ్యాధి కగా.. ఇది కాలేయ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు కాఫీని బెస్ట్ ఆప్షన్‌గా సూచిస్తున్నారు ఎక్స్‌పర్ట్స్.
కాఫీలో యాంటీ-ఫైబ్రోటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కొలెస్ట్రాల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ స్టడీ ఆఫ్ లివర్ ప్రాక్టీస్ గైడెన్స్ ప్రకారం.. కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్న దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఉన్న రోగులు రోజుకు కనీసం మూడు కప్పుల కాఫీ తీసుకోవాలి. ఆరు కప్పుల వరకు తీసుకుంటే ప్రయోజనాలు పెరగొచ్చు కూడా. 10గ్రా. కాఫీ పౌడర్‌తో తయారు చేసిన కాఫీ 100 మిల్లీలీటర్లు ఉండాలి. లేదంటే ఐదు గ్రాముల ఇన్‌స్టాంట్ కాఫీ కూడా మంచిది. ప్యూర్ బ్లాక్ కాఫీ తీసుకోలేకపోతే.. జీరో-క్యాలరీ స్వీటెనర్‌ను యాడ్ చేయొచ్చు.
చివరి కప్పు కాఫీ నిద్రవేళకు కనీసం నాలుగు గంటల ముందు తాగాలని సూచిస్తున్న నిపుణులు.. కాఫీ రక్తపోటు, హృదయ స్పందన రేటును ప్రభావితం చేయదని, రిఫ్లక్స్, గ్యాస్ట్రిటిస్ లేదా కడుపు పూతలకి దోహదం చేయదని తెలిపారు. కాలేయ క్యాన్సర్ ప్రమాదం ఉన్న వ్యక్తులకు ప్రతిరోజూ కనీసం మూడు కప్పుల బ్లాక్ కాఫీ తాగమని సిఫార్సు చేస్తున్నారు. ఈ ప్రయోజనాలు ఎక్కువగా క్లోరోజెనిక్ ఆమ్లాలు, కెఫిన్ వంటి సమ్మేళనాల వల్ల కలుగుతాయి. ఇవి కొవ్వు కాలేయ వ్యాధి సిర్రోసిస్ వంటి తీవ్రమైన పరిస్థితులు తలెత్తకుండా నిరోధిస్తాయి.








