ఒక్క శుక్రకణంలో 0.8GB డేటా..WiFi కంటే స్పీడ్!

by B.Srinivas |   (  Updated:2026-01-23 07:57:19  IST  )

ఒక్క శుక్రకణంలో 0.8 జీబీ డేటా ఉంటుందని జీవశాస్త్రవేత్తలు వెల్లడించారు. మొత్తం 150,000 టెరాబైట్లకుపైగా అంచనా వేశారు.

ఒక్క శుక్రకణంలో 0.8GB డేటా..WiFi కంటే స్పీడ్!
X

దిశ, ఫీచర్స్: మానవుల్లో ప్రతి కణం ఊహించలేని సమాచారాన్ని కలిగి ఉంటుందని మీకు తెలుసా? ఇప్పటివరకు తయారుచేసిన హార్డ్ డిస్క్ డ్రైవ్ కంటే మన బాడీ అధునాతనమైనదని ఎప్పుడైనా విన్నారా? మన శరీరంలోని శుక్రకణం, అండానికి సాంకేతికతతో సంబంధం ఉందనే ఆశ్చర్యకరమైన విషయం గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఈ మేరకు హ్యూమన్ బాడీ-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మధ్యనున్న ఇంట్రెస్టింగ్ రిలేషన్‌‌ను శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

TB డేటాతో సమానం:
ఈ మేరకు హ్యూమన్ బాడీలోని ఇన్ఫర్మేషన్ మొత్తం DNA రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. కంప్యూటర్లలో ఎలాగైతే 0,1(Binary) రూపంలో డేటాను భద్రపరుస్తాయో.. DNA కూడా 4 రూపాల్లో A (Adenine), G(Guanine), C(Cytosine), T(Thymine) డేటాను దాచుకుంటుంది. అందులో ఒక్క శుక్రకణంలో సుమారు 3.2 బిలియన్ బేస్ పెయిర్స్ ఉంటాయి. ప్రతి బేస్ పెయిర్‌ను 2 బిట్లుగా లెక్కించి దీనిని బైట్లుగా మారిస్తే దాదాపు 750 MB నుంచి 800 MB (0.8 GB) అవుతుంది. అయితే ఒక మిల్లీ లీటర్ వీర్యంలో మిలియన్ల సంఖ్యలో శుక్రకణాలుంటాయని, వీటినుంచి రిలీజ్ అయ్యే సమాచారం దాదాపు 150,000 టెరాబైట్ల (TB) డేటాతో సమానం అని వైద్యులు వెల్లడించారు. ఇక శుక్రకణం-అండం కలిసే ప్రక్రియ కేవలం కొన్ని సెకన్లలోనే జరుగుతుందని, అందుకే దీనిని ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ‘డేటా ట్రాన్స్‌ఫర్’అని సరదాగా పిలుస్తుంటారు.

ఒక పిండానికి 1.6 GB
ఇక ఒక్క శుక్రకణంలో ఉండే 23 క్రోమోజోముల్లో తండ్రి నుంచి బిడ్డకు 50శాతం సమాచారం మాత్రమే అందుతుంది. మిగిలిన 50% సమాచారం తల్లి అండం (Egg cell) నుంచి వస్తుంది. ఈ రెండు కలిసినప్పుడు అది సుమారు 1.6 GB డేటా అవుతుంది. దీని ఆధారంగా ఒక చిన్న కణంలో ఇంతభారీ డేటా భద్రపరిస్తే.. హార్డ్ డిస్కులతో పోలిస్తే మానవ శరీరం ఎంతటి బయోలాజికల్ కంప్యూటరో అర్థం చేసుకోవచ్చు. ఇక హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్‌లో (Human Genome Project) భాగంగా డాక్టర్ టామ్ కాడ్వాలడర్ వంటి ఐటీ నిపుణులు, బయో-ఇన్ఫర్మేటిక్స్ శాస్త్రవేత్తలు ఈ జన్యు సమాచారాన్ని డిజిటల్ డేటా పరిమాణంలోకి మార్చి (Data Conversion), ఒక శుక్రకణంలో ఇంత డేటా ఉంటుందని వివరించారు.

1.6 GBలో ఏముంటుంది?
- ఈ డేటాలో బిడ్డకు సంబంధించిన పూర్తి బ్లూప్రింట్ ఉంటుంది.
- కంటి రంగు, చర్మం రంగు.
- ఎత్తు, జుట్టు ఆకృతి.
- కొన్ని రకాల వంశపారంపర్య వ్యాధుల సమాచారం.- శరీర అవయవాల నిర్మాణం ఎలా ఉండాలనే సూచనలుంటాయి.

Next Story