- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘డార్క్ థెరపీ’తో మెంటల్ హెల్త్‌కు మేలు.. వెంటనే ఫాలోకండి!
‘డార్క్ థెరపీ’తో బోలెడు హెల్త్ బెన్‌ఫిట్స్ ఉన్నాయని ప్రముఖ అమెరికన్ బయోహ్యాకర్ డేవ్ ఆస్ప్రే చెబుతున్నారు.

దిశ, ఫీచర్స్: మానవ శరీరం పనితీరు, జీవన విధానం మెరుగుపరచడానికి బయోహ్యాకింగ్ పద్ధతులను ఉపయోగించే ప్రముఖ అమెరికన్ రచయిత, బయోహ్యాకర్ డేవ్ ఆస్ప్రే (Dave Asprey).. మరో ఆసక్తికరమైన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తాజాగా ‘చీకటి’ (Darkness)ని అత్యుత్తమ ఉచిత బయోహ్యాక్ (Darkness best free biohack)గా పేర్కొన్నారు. దీని వెనుక ప్రధాన కారణాలను కూడా ఆయన వివరించారు. ఈ సంవత్సరం వీలైనంత వరకు కళ్లు బైర్లు కమ్మే లైట్లు ఆపేయగలిగితే డార్క్ థెరఫీ (Dark Therapy) సక్సెస్ అవుతుందని, క్యాండిల్ తరహా వెలుతురును ఆశ్వాదించేలా అలవాటుపడితేనే మానవజాతి మరింత ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటుందని చెబుతున్నారు. లేదంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లంచుకోక తప్పదని హెచ్చరించారు.
మన శరీరం ప్రకృతి సిద్ధంగా Circadian Rhythm(అంతర్గత గడియారం)పై ఆధారపడి పనిచేస్తుంది. చీకటి పడగానే మన మెదడులోని పీనియల్ గ్రంథి మెలటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. అయితే ఈ ఆధునిక కాలంలో రాత్రిపూట కూడా మనం కృత్రిమ కాంతి (ఫోన్లు, ఎల్‌ఈడీ లైట్లు) మధ్య ఉండటం వల్ల ఈ వ్యవస్థ దెబ్బతింటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘మన మెదడులోని హైపోథాలమస్ అనే భాగంలో ఒక మాస్టర్ క్లాక్ ఉంటుంది. ఇది మన ఇంటర్నల్ బాడీపై పడే వెలుతురు ఆధారంగా పనిచేస్తుంది. వెలుతురు చూసినప్పుడు మెదడు ‘కార్టిసాల్’ అనే హార్మోన్‌ను విడుదల చేసి మనల్ని అప్రమత్తంగా, ఉత్సాహంగా ఉంచినా.. ‘మెలటోనిన్’ మనకు మేలు చేస్తుంది. గదిలోకి కిటికీల ద్వారా వచ్చే కొద్దిపాటి వీధి దీపాల వెలుతురు కూడా 69%శాతం మనకు డిప్రెషన్‌ను పెంచుతుందని ఇప్పటికే పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి మనం ఉండే గదిలో లైట్లను డిమ్ చేయగలిగితే లేదా కొవ్వొత్తి వెలుగును పొందగలిగితే హెల్త్‌కు ఏంతో మేలు జరుగుతుంది’ అని బయోహ్యాకింగ్ మ్యాన్ బలంగా చెబుతున్నారు.
మైటోకాండ్రియా రికవరీ మస్ట్..
మానవ శరీరానికి మైటోకాండ్రియా (Mitochondria) రికవరీ చాలా ఇంపార్టెంట్. ఒకరకంగా మైటోకాండ్రియా మన బాడీకి పవర్ హౌస్ లాంటిదని ఆస్ప్రే పేర్కొన్నారు. నిరంతరం శక్తినిచ్చే మైటోకాండ్రియా కణాలు ఎక్కువసేపు వెలుతురులో ఉంటే అలసిపోతాయని, కావున ఇవి తిరిగి ఉత్తేజితం కావడానికి సంపూర్ణమైన చీకటి కావాలంటున్నారు. మెదడు విడుదల చేసే ‘మెలటోనిన్‘ హార్మోన్ ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, మైటోకాండ్రియాను మళ్లీ ఆరోగ్యంగా మారుస్తుందని తెలిపారు. మనం గాఢనిద్రలో, ముఖ్యంగా చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే శరీరం ఈ మైటోఫాగీ ప్రక్రియను వేగవంతం చేసి, శరీరాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తుందని డేవ్ వివరించారు.






