భూ భారతి ఓవర్ లోడ్.. ! గతంకంటే పెరిగిన ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు

by Javid Pasha |   (  Updated:2025-07-26 11:01:38  IST  )

భూ భారతి ఓవర్ లోడ్.. ! గతంకంటే పెరిగిన ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు

భూ భారతి ఓవర్ లోడ్.. ! గతంకంటే పెరిగిన ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దివాళా తీసిందని దుష్ప్రచారం జరుగుతున్నది. కానీ అటు ప్లాట్లు/ఫ్లాట్లు, ఇటు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, లావాదేవీల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉన్నది. కొందరు రియల్టర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు అమ్మకాలు తగ్గాయని ఉద్దేశ్యపూర్వకంగానే ప్రచారం చేస్తున్నారు. ఎటు చూసినా రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదంటూ ఏజెంట్లు, బ్రోకర్లు చర్చించుకుంటున్నారు. కానీ అధికారిక లెక్కలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో ఎన్ని లావాదేవీలు నమోదయ్యాయో, ఇప్పుడు అంత కంటే ఎక్కువగానే ఉండడం గమనార్హం.

ప్రధానంగా హైదరాబాద్ నగర శివారు జిల్లాలతో పాటు అన్ని అర్బన్ ఏరియాలకు పక్కనున్న మండలాల్లో జోరుగా నడుస్తున్నాయి. ప్రధానంగా త్రిబుల్ ఆర్ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులతో ఊపందుకున్నది. అటు రెసిడెన్షియల్ ప్లాట్లతో పాటు వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు కూడా పెరిగాయి. ఒక్కో రోజు ఈ లావాదేవీల సంఖ్య పెరగడంతో భూ భారతి వెబ్ సైట్ పై ఓవర్ లోడ్ పడుతుంది. దాంతో వెబ్ సైట్ సరిగ్గా పని చేయడం లేదని, సర్వర్ డౌన్ అని వస్తుంది. ఈ విషయాన్ని లెక్కలతో సీసీఎల్ఏ అధికారులు స్పష్టం చేశారు. గతేడాది కంటే రోజు వారి సగటు కూడా పెరగడం వల్లనే ఈ సమస్య తలెత్తుతున్నట్టు తెలిపారు. దీన్ని బట్టి భూముల క్రయ విక్రయాలు తగ్గలేదని స్పష్టమవుతుంది.

4 వేలు దాటిన ట్రాన్సక్షన్స్

ఒక్కో రోజు భూ భారతి పోర్టల్ పై అధిక లోడ్ పడుతుంది. అనవసరమైన డేటా పేరుకుపోవడంతో పాటు రిజిస్ట్రేషన్లు, ఇతర డీడ్స్, అప్లికేషన్ల సంఖ్య పెరిగింది. గతంలో రోజుకు 2500 నుంచి 3000 వరకు అయ్యే ట్రాన్సక్షన్స్ సంఖ్య 4 వేలు దాటింది. ఈ క్రమంలోనే ఓటీపీలు రాకపోవడం, సైట్ త్వరగా ఓపెన్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్టు సీసీఎల్ఏ అధికార వర్గాలు చెప్పాయి. రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందన్న ప్రచారం ఉత్తదేనని తెలుస్తుంది.



Next Story