- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చలికాలం స్వెటర్లు వేసుకుని పడుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి !
అలా టైట్ స్వెటర్ వేసుకోవడం వల్ల బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా జరగదని చెబుతున్నారు వైద్య నిపుణులు. కాస్త లూజుగా,

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం చలికాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఏపీ కంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువగా కొనసాగుతోంది. అయితే చలికాలం రాగానే అందరూ స్వెటర్లు ధరిస్తూ ఉంటారు. చలి కాలంలో స్వెటర్ల కంటే, కాటన్, లెనిన్, బ్రీతిబుల్ దుస్తులు ధరించి పడుకుంటే మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు. టైట్ గా ఉన్న స్వెటర్ అస్సలు ధరించకూడదట.
అలా టైట్ స్వెటర్ వేసుకోవడం వల్ల బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా జరగదని చెబుతున్నారు వైద్య నిపుణులు. కాస్త లూజుగా, పొడి, బ్రీతబుల్ గా శుభ్రంగా ఉండే స్వెటర్ వేసుకుంటే మంచిదని సూచనలు చేస్తున్నారు. అంతే కాదు స్వెటర్ వేసుకుని పడుకోవడం వల్ల బీపీ పూర్తిగా తగ్గిపోతుందట. దానివల్ల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. స్వెటర్లు కొనుగోలు చేసేటప్పుడు మృదువుగా ఉండేటివి కొనుగోలు చేయాలని అంటున్నారు. దురదపెట్టేలా అస్సలు ఉండకూడదు.
వేసుకుంటే, చాలా సింపుల్ గా ఉండేలా చూడాలని చెబుతున్నారు వైద్యలు. ఈ చలి కాలంలో కాళ్లకు సాక్సులు వేసుకుంటే నిద్ర బాగా పడుతుందని స్పష్టం చేస్తున్నారు. వాటిని కూడా శుభ్రంగా, లూజుగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు వైద్యులు. ఇక ఈ చలి కాలంలో చెవుల్లోకి చల్లటి గాలి వెళ్లకుండా జాగ్రత్తలు పడాలని అంటున్నారు. టోపీ లాంటి ధరించి, పడుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల చెవుల్లోకి చల్లటి గాలి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అంటున్నారు వైద్యు నిపుణులు.






