Viral : ఆ ఒక్క పిలుపు అంత పనిచేస్తుందా? ఒక స్త్రీని ఆ విధంగా..!!

by Javid Pasha |   (  Updated:2025-04-23 07:46:18  IST  )

Viral : ఆ ఒక్క పిలుపు అంత పనిచేస్తుందా? ఒక స్త్రీని ఆ విధంగా..!!

Viral : ఆ ఒక్క పిలుపు అంత పనిచేస్తుందా? ఒక స్త్రీని ఆ విధంగా..!!
X

దిశ, ఫీచర్స్ : ఒక్క మాట చాలు.. మనిషి మనుసునే మార్చేస్తుంది కొన్నిసార్లు. ఆ ఒక్కమాటే చాలు.. ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంది మరి కొన్నిసార్లు. ఇక మాటంటే.. ఇక్కడ పిలిచే విధానం.. పలికే తీరు కూడా అంటున్నారు నిపుణులు. ఒక వ్యక్తిని మీరు ఎలా పిలుస్తారన్నది కూడా ముఖ్యమే. అయితే మహిళలను వారికి ఇష్టమైన వ్యక్తులు బేబీ(baby) అని పిలిస్తే అది వారి మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

మీ భాగస్వామి లేదా ప్రియురాలు అధిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారా? అయితే అందుకు చక్కటి మెడిసిన్ మీ పిలుపులో కూడా ఉంది. ఏంటంటే.. మీరు ప్రేమతో బేబీ(baby)అని పిలిస్తే చాలు. ఆ ఒక్క మాట ఆమె మనసుకు హాయినిస్తుంది. అప్పుడప్పుడూ అలా పిలుస్తూ ఉంటే.. క్రమంగా ఆమె మానసిక ఆరోగ్యం కుదుట పడే అవకాశం ఉంటుంది. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ప్రియమైన వ్యక్తి లేదా భాగస్వామి తనను బేబీ(baby) అని పిలవడాన్ని ఒక మహిళ చాలా ఇష్టపడుతుందట. అంతేకాదు ఆ పిలుపు సదరు మహిళ మెదుడు ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని, భావోద్వేగ ఒత్తిడి (From emotional stress) నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే ప్రత్యేకించి బేబీ(baby) అని పిలవడం మాత్రమే కాదు. సాధారణంగానే ప్రియమైన పిలుపు (terms of endearment) మానవ సంబంధాల్లో భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేస్తుందని, ఆక్సిటోసిన్ (oxytocin) విడుదలను ప్రేరేపించడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా తమకు ఇష్టమైన లేదా ప్రియమైన వ్యక్తి బేబీ అని పిలవడం మహిళల్లో సురక్షిత భావాన్ని ఏర్పరుస్తుందట. 2016 నాటి ‘Journal of Neuroscience’ అధ్యయనం కూడా దాదాపు ఇదే పేర్కొన్నది.

Next Story