- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: బీరు బోతులు చేసిన పనికి సెల్యూట్ చేయడం ఖాయం.. ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
Viral Video: తాగుబోతులు తలుచుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ మారిపోతుంది అని సరదాగా చెబుతూ ఉంటారు.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: తాగుబోతులు తలుచుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ మారిపోతుంది అని సరదాగా చెబుతూ ఉంటారు. కానీ నిజంగానే మన ప్రభుత్వ ఖజానాను సగం నింపేది తాగుబోతులే అని చెప్పవచ్చు. మద్యం వల్ల వచ్చే ఆదాయంతోనే రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తుంటాయని పేపర్లలో మనం చదువుతూ ఉంటాము. అయితే తాగుబోతులంటే సమాజంలో అందరికీ చులకనే ఉంటుంది ఎందుకంటే మద్యం మత్తులో వారు కొన్నిసార్లు నేరాలకు సైతం పాల్పడుతుంటారు.
అయితే తాగుబోతులు వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయని ప్రస్తుతం ఈ వీడియోని చూసి మనం తెలుసుకోవచ్చు. థాయిలాండ్ ఓ వ్యక్తి తన భార్య అతడి తాగుడు అలవాటుకు విసుక్కుంటుందని తెలుసుకొని ఆమెకు సర్ప్రైజ్ చేసేందుకు ఓ ప్రయత్నం చేశాడు. తాను తాగిన బీరు బాటిల్లతో పాటు చుట్టుపక్కల ఉన్న బీరు బాటిల్స్ అన్ని తీసుకొని వచ్చి వాటితో చక్కగా ఒక గాజు సీసాల భవంతుని తయారు చేశాడు.
అందుకోసం వేలాది బీరు బాటిల్స్ కలెక్ట్ చేసి వాటిని సిమెంటు ద్వారా ఇటుకల్లాగా వాడి ఒక ఇంటిని నిర్మించారు ఇప్పుడు ఆ ఇంటిని తన భార్యకు బహుమతిగా ఇచ్చాడు ఆ ఇల్లు చూడటానికి చాలా అందంగానో వెరైటీగాను ఉంది. ఇంట్లోకి సహజసిద్ధమైన కాంతి ప్రవేశిస్తుంది కరెంటుతో పని లేకుండానే ఇంట్లో ఎంచక్కా వెలుతురు వస్తుంది. మధ్య మధ్యలో గాలి ఆడేలాగా కొన్ని బాటిళ్లకు రంధ్రాలు సైతం చేశాడు.
మొత్తానికి సోషల్ మీడియాలో ఈ ఇల్లు తెగ వైరల్ అవుతుంది. ఇక మనదేశంలో కూడా మన రాష్ట్రంలోని తాగుబోతులకు ఈ వీడియో చూపిస్తే ఏకంగా బీరు సీసాలతో పోలవరం డ్యామ్ కట్టేస్తారేమో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్లు మిగులుతాయని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మరోవైపు మద్యం సేవించడం హానికరం అన్న సంగతి గుర్తించాలి.
మద్యం ఏ రూపంలో సేవించినప్పటికీ ఎంత సేవించినప్పటికీ లివర్ దెబ్బ తినడం ఖాయమని వైద్యులు సూచిస్తున్నారు. పైన పేర్కొన్న వార్త మద్యపానాన్ని ప్రోత్సహించడానికి కాదు ఇది కేవలం పాఠకులకు సమాచారం తెలియజేయడానికి మాత్రమే అని గుర్తించాలి. గమనిక : మద్యపానం ఆరోగ్యానికి హానికరం






