- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral News: మొక్క నాటండి.. కోటిశ్వరులు అవ్వండి.. ఈ వార్త చదవడం మిస్ కాకండి!!
Viral News: మొక్కలు నాటడం చాలా మందికి ఇష్టం ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: Viral News: మొక్కలు నాటడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇంటి ఏమాత్రం ఖాళీ స్థలం ఉన్నా అందులో మొక్కలు నాటి సంరక్షిస్తుంటారు. డాబా మీద కూడా మొక్కలు పెంచుతుంటారు. ఇలాంటి అలవాటు సంపాదనకు మార్గం చూపిస్తే మరింత ఉత్సాహంగా ఉంటుంది. అలాంటిదే మహోగని చెట్టు. దాన్ని నాటిన 12 సంవత్సరాల తర్వాత మీరు కోటీశ్వరులు అవుతారు. అవును ఇది నిజం. ఎందుకంటే ఆ మొక్కకు ఉన్న డిమాండ్ అలాంటిది. మాములుగా మొక్కలను 15 నుంచి 20 రూపాయల మధ్యలో కొనుగోలు చేస్తుంటాం. కాస్త ఎక్కువైతే 50 రూపాయలు వరకు వెచ్చిస్తాం. కానీ ఈ మహోగని చెట్టు ధర ఎంత ఉంటుందో తెలుసా. ఈ కలప ఘనపు అడుగుకి రూ. 2000 నుంచి 2200 వరకు ఉంటుంది. కానీ అమ్మేటప్పుడు ఓ నియమం పాటించాల్సి ఉంటుంది. చెట్టు నిటారుగా, పొడవుగా పెరగాలి. అప్పుడే మంచి ధర వస్తుంది. ఈ చెట్టు కలపే మాత్రమే కాదు ఆకులు, గింజలు కూడా చాలా ధర పలుకుతాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం 120 మహోగని మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే 12ఏళ్లలో కోటీశ్వరులు అయిపోవచ్చని చెబుతున్నారు. 6 ఏళ్లలోనే ఈ చెట్టు పూర్తిగా పెరుగుతుంది. మహోగని మొక్కలు నాటితే ఇంకో ప్రయోజనం కూడా ఉంటుంది. అదేంటంటే ఆ చెట్ల మధ్యలో ఇతర పండ్ల చెట్లను కూడా నాటుకోవచ్చు.
ఈ చెట్లను పెంచాలంటే ముందుగా రైతులు మట్టిన టెస్ట్ చేయాలి. మట్టి పీహెచ్ విలువ 6 నుంచి 7 మధ్య ఉండాలి. ఒక చెట్టు నాటిన తర్వాత మరో చెట్టు నాటాలంటే కనీసం 4-5 మీటర్ల దూరం తప్పనిసరిగా ఉండాలి. చెట్టును ఒక అడుగు వెడల్పు గుంతలో నాటాల్సి ఉంటుంది. మొదట్లో జీవామ్రుతం ఎరువు వేస్తే సరిపోతుంది. 100 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 100 గ్రాముల యూరియా , 50 గ్రాముల పొటాష్ మొక్క నాటేటప్పుడు వేయాల్సి ఉంటుంది. జులై నెల మహోగని మొక్కలు నాటేందుకు సరైన సమయం.






