జర భద్రం బ్రదర్! ఏసీలు పేలుతున్నాయి!

by Yella Dhawani Reddy |

ప్రస్తుతం ఎండకాలం నడుస్తోంది. దీనికి తోడు సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండ వేడిమి, ఉక్కబోతల నుంచి ఉపశమనం పొందేందుకు ఇళ్లలో ఏసీలు వినియోగిస్తుంటారు.

జర భద్రం బ్రదర్! ఏసీలు పేలుతున్నాయి!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఎండకాలం (Summer) నడుస్తోంది. దీనికి తోడు సూర్యుడు (Sun) నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండ వేడిమి, ఉక్కబోతల నుంచి ఉపశమనం పొందాలంటే.. రోజంతా ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నడవాల్సిందే. ఈ క్రమంలో ఏసీలను (AC) వినియోగించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఘోర ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఇటీవల కాలంలో ఏసీలు పేలిన ఘటనలు ఎక్కువయ్యాయి. చాలా చోట్ల ఏసీలు పేలి భారీ అగ్నిప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఏసీ ఎందుకు పేలుతుందో, పేలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఏసీలు పేలడానికి ముఖ్యమైన కారణాలు

* ఏసీ ప్రమాదాలు ఎక్కువగా అవి సరిగ్గా పనిచేయకపోవడం లేదా తప్పుడు నిర్వహణ కారణంగా జరుగుతుంది.

* అలాగే ఏసీలోని కంప్రెసర్ వేడెక్కడం వల్ల పేలుడు సంభవించవచ్చు. ఏసీ బ్రేక్ లేకుండా వాడితే, వేడి ఎక్కువగా వస్తుంది. ఈ వేడిమి పెరిగినప్పుడు మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది.

* ఏసీలోని ఎలక్ట్రికల్ వైర్లను సరిగ్గా జత చేయకపోతే లేదా తగిన మార్పిడి లేకుండా ఉపయోగించినట్లయితే, షార్ట్ సర్క్యూట్ లేదా స్పార్క్‌లు జరిగే అవకాశముంటుంది.

* పాత లేదా దెబ్బతిన్న పైపుల ద్వారా రిఫ్రిజిరేటర్ గ్యాస్ లీక్ కావడం వల్ల ఈ గ్యాస్ మంటలు చెలరేగి పేలుడుకు కారణమవుతుంది.

* విద్యుత్ సరఫరాలో వేగంగా పెరుగుదల లేదా తగ్గుదల ఏసీ పరికరాలను నాశనం చేయవచ్చు. దీనివల్ల అధిక వేడి, స్పార్క్స్ లేదా అగ్ని ప్రమాదానికి దారితీసే ఛాన్సుంది.

ఏసీలు పేలకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలు

* ఏసీ యూనిట్ ఎలా ఉందో తరచూ చెక్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయించడం వల్ల ఏసీలో ఉన్న లోపాలు బయటపడతాయి.

* ఏసీని వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో పెట్టడం మంచిది. మంచి వెంటిలేషన్ ఉంటే ఏసీ వేడెక్కకుండా ఉంటుంది.

* 600 గంటల పాటు ఏసీ రన్ అయ్యాక ఖచ్చితంగా సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి. అలాగే, ప్రతి సంవత్సరంలో కనీసం రెండు సార్లు ప్రొఫెషనల్‌గా సర్వీస్ చేయించాలి. గ్యాస్ లీకేజీలు, వైరింగ్, ఫిల్టర్‌లు, ఇతర భాగాల తనిఖీ చేయించడం ద్వారా పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు.

* వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, ACకి విరామం ఇవ్వడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే, ఏసీ అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేకపోవడంతోపాటు అనవసరంగా నష్టం కలిగించకుండా ఉంటుంది.

* విద్యుత్ లోపాలు లేదా వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఏసీకి హానికరం. వోల్టేజ్ స్టెబిలైజర్ ఉపయోగించి ఈ సమస్యను నివారించవచ్చు.

* ఏసీలో వింత వాసన లాంటిది గమనించినట్లయితే, వెంటనే టెక్నీషియన్‌ను పిలిపించి చెక్ చేయించాలి.

Next Story