ఇంటి టెర్రస్‌పై 85 రకా ఔషధ మొక్కల తోటను సృష్టించింది

by Daayi Srishailam |

ఆమె కృషి ఫలితంగా రైతు నేస్తం అవార్డును అందుకుంది

ఇంటి టెర్రస్‌పై 85 రకా ఔషధ మొక్కల తోటను సృష్టించింది
X

దిశ, ఫీచర్స్: విశాఖపట్నంలోని ఒక సాధారణ గృహిణి అయిన బంగారు ఝాన్సీ తన ఇంటి టెర్రస్‌ను 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో పచ్చని స్వర్గంగా మార్చి 85 రకాల పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలతో సహా అద్భుతమైన తోటను సృష్టించింది. ఆమె కృషి ఫలితంగా రైతు నేస్తం అవార్డును అందుకుంది.

అత్తారింట్లో మొక్కల్లేవని

28 ఏళ్ల బంగారు ఝాన్సీది విశాఖపట్నం. బీకాం వరకు చదివింది. ఆ తర్వాత ఒక సంస్థలో మేనేజర్‌గా పనిచేసింది. 2021లో ఝాన్సీకి వివాహం జరిగింది. అత్తారింట్లో ఒక్క మొక్క కూడా లేకపోవడం తనకు ఏదోలా అనిపించింది. కానీ పుట్టినిల్లు మొక్కలతో నిండిపోయి ఉండేది. చిన్నప్పటి నుంచి తోట పనిచేసేది ఝాన్సీ. ఇలాగైతే కష్టమే అని భావించి భర్తతో డిస్కస్ చేసింది. కొత్త పెళ్లి కూతుర్ని అనే విషయమే మరచిపోయి తోటను నిర్మించే పనిలో నిమగ్నమైంది. నెల రోజుల్లోపే టెర్రాస్ పై అద్భుతమైన తోటను తయారు చేసింది. అత్తింటివారు ఆమె ఆసక్తిని చూసి సంబరపడిపోయారు.

పిల్లల్లా చూసుకుంటూ..

ఝాన్సీకి వాళ్ల అమ్మమ్మ స్ఫూర్తి. ఆవిడ ఎప్పుడు చూసినా తోట పనిమీదే ఉండేదట. ఇంకా దక్షిణ కొరియా రైతు చో హాన్-క్యూ రాసిన సహజ వ్యవసాయం గురించి రాసిన పుస్తకం కూడా ఝాన్సీని చాలావరకు ప్రభావితం చేసిందట. వాళ్లిద్దరి స్ఫూర్తితో అత్తారింట్లో 600 మొక్కలతో నిండిన పచ్చని తోటను నిర్మించింది. ఈ తోటలో మామిడి, బత్తాయి, జామ, వంకాయ, బెండకాయ, టమాట, లెట్యూస్, పుదీనా, పర్పుల్ యామ్, పాలకూర, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష, లిచీ, గుమ్మడి వంటి అనేక రకాల మొక్కలు ఉన్నాయి. వీటిని చంటి పిల్లల్లా చూసుకుంటూ మురిసిపోతుంది.

సొంతంగా మిశ్రమం

మామూలుగా టెర్రాస్ గార్డెనింగ్ రసాయనాలతో చేస్తారు. కానీ ఝాన్సీ ఎప్పుడు కూడా రసాయనాలు వాడలేదు. అందుకే వాళ్ల తోటలో పండినవి సహజమైనవి, రుచిలోనూ, సుగంధంలోనూ భిన్నంగా ఉంటాయి. రోజుకు మూడు గంటలు తోటకు కేటాయిస్తూ సహజ ఎరువులు, కంపోస్ట్, పురుగుమందులను స్వయంగా తయారుచేస్తుంది. టెర్రస్‌పై బరువు ఎక్కువ కాకుండా ఉండేలా ఝాన్సీ 30% వెర్మీకంపోస్ట్/వంటగది వ్యర్థాల కంపోస్ట్/ఆవు పేడ, 30% మట్టి, 30% కొబ్బరి పీచు (కోకోపీట్), 10% వేప పిండితో కూడిన మిశ్రమాన్ని సిద్ధం చేస్తుంది. ఈ మిశ్రమాన్ని కుండీలో నింపి మొక్కలను నాటుతుంది.

రైతునేస్తం అవార్డు

ఇంటి టెర్రస్‌పై 85 రకా ఔషధ మొక్కల తోటను సృష్టించింది. ఆమె కృషి ఫలితంగా రైతు నేస్తం అవార్డును అందుకుందిఇంటి టెర్రస్‌పై 85 రకా ఔషధ మొక్కల తోటను సృష్టించింది. ఝాన్సీ తోట విశాఖపట్నం మేయర్ హరి వెంకట కుమారితో సహా అనేక మంది ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. 2024లో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మకమైన "డాక్టర్ ఐవీ సుబ్బారావు రైతు నేస్తం అవార్డు"ను అందుకుంది. అవార్డు అందుకున్న తర్వాత ప్రతి ఇంట్లో సొంతంగా కూరగాయలు, పండ్లు పండించేలా ప్రోత్సహించాలనే బాధ్యత మరింత పెరిగిందని చెప్తోంది ఝాన్సీ. సామాన్య గృహిణి నుంచి సహజ వ్యవసాయ నిపుణురాలిగా మారిన స్ఫూర్తిదాయక ప్రయాణం ఝాన్సీది. ఆమె పద్ధతులు సరళమైనవి, సమర్థవంతమైనవి, సుస్థిరమైనవి కాబట్టే విజయం సొంతమైంది.

Next Story