స్కూల్స్ రీఓపెన్.. పిల్లల మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది??? తప్పక చదవండి..

by Sujitha Rachapalli |

సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. దాదాపు రెండు నెలల తర్వాత స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. దీంతో పిల్లలు మళ్లీ బడి బాట పట్టాల్సిన సమయం వచ్చేసింది. అయితే ఇన్ని రోజులు ఇంట్లో తమకు నచ్చిన విధంగా

స్కూల్స్ రీఓపెన్.. పిల్లల మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది??? తప్పక చదవండి..
X

దిశ, ఫీచర్స్ : సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. దాదాపు రెండు నెలల తర్వాత స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. దీంతో పిల్లలు మళ్లీ బడి బాట పట్టాల్సిన సమయం వచ్చేసింది. అయితే ఇన్ని రోజులు ఇంట్లో తమకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేసిన వారు.. ఒక్కసారిగా పాఠశాలకు వెళ్లాలంటే తమను తాము ప్రిపేర్ చేసుకోవాల్సిందే. కొందరు ఈ విషయంలో ఎగ్జైట్మెంట్‌తో ఉంటే మరికొందరు చిన్నారులు ఆందోళన, నిరాశతో బాధపడుతుంటారు. కొందరు ఫ్రెండ్స్‌ను కలిసి స్కూల్ రొటీన్‌లో ఎంజాయ్ చేసేందుకు వెయిట్ చేస్తుంటే.. ఇంకొందరు కొత్త తరగతులకు ప్రమోషన్, అకాడమిక్ చాలెంజెస్ వంటి మార్పులకు భయపడుతుండొచ్చు. కాబట్టి పిల్లల మెంటల్ స్టేటస్‌ను తల్లిదండ్రులు, గురువులు గుర్తించాల్సిన అవసరం ఉందంటున్న నిపుణులు.. వారికి మద్దతిస్తూ స్కూల్‌కు తిరిగివెళ్లేలా మార్చాలని సూచిస్తున్నారు. ఈ టైంలో పిల్లల్లో ఎలాంటి పాజిటివ్, నెగెటివ్ ఎమోషన్స్ ఉంటాయో వివరిస్తున్నారు.

పాజిటివ్ ఎమోషన్స్ :

స్టూడెంట్స్ తమ స్నేహితులను కలిసే సమయం కోసం ఎదురుచూస్తుండొచ్చు. న్యూ యాక్టివిటీస్‌లో పాల్గొనడం, న్యూ అకాడమిక్ సబ్జెక్ట్స్ ఎక్స్‌ప్లోర్ చేయడం గురించి వెయిట్ చేస్తుండొచ్చు. లేదంటే సమ్మర్‌లో ఎంజాయ్ చేసిన విషయాలను ఫ్రెండ్స్‌తో పంచుకునే అవకాశం కోసం ఎదురుచూస్తుండొచ్చు. కొత్త పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు వంటి విషయాల్లో హ్యాపీగా ఉండొచ్చు. పొద్దున్నే స్కూల్‌కు వెళ్లడం, ఈవినింగ్ వరకు క్లాసెస్ ఎంజాయ్ చేసి, ఫ్రెండ్స్‌తో గడిపి, ఇంటికి చేరే స్ట్రక్చర్డ్ రొటీన్‌ను ఇష్టపడుతుంటారు పిల్లలు. తాము చేసే పనిలో ఏదో పర్పస్ ఉందని ఫీల్ అవుతుంటారు.

నెగెటివ్ ఎమోషన్స్ :

సమ్మర్ హాలిడేస్‌లో తమకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేసిన పిల్లలు... తరగతి గదుల్లో ఒకే చోట కూర్చునే పరిస్థితి వస్తుందంటే బాధపడిపోతారు. మళ్లీ స్కూల్‌కు వెళ్లాలంటే స్ట్రెస్‌గా ఫీల్ అవుతారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో తమ ఫ్రెండ్స్‌తో కనెక్షన్ లేనప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ ఎదురవుతుంది. లేదంటే చదువులంటే పడని, క్లాస్ టీచర్స్‌ కారణంగా బాధపడే పిల్లలు ఈ మార్పు‌ను అస్సలు యాక్సెప్ట్ చేయలేరు. సమ్మర్ స్లైడ్.. అంటే సెలవుల్లో ఏమీ నేర్చుకోకుండా కేవలం ఆడుకోవడం మీదనే కాన్సంట్రేట్ చేసిన పిల్లలు అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందోననే భయంలో ఉండిపోతారు.

ఇలా సపోర్ట్ చేయండి..!!

* ఏజ్, పర్సనాలిటీ, ఎక్స్‌పీరియన్స్, సపోర్టింగ్ సిస్టెమ్స్ బేస్ చేసుకుని స్కూల్‌కు తిరిగి రావాలనే ఆలోచన ఒక విద్యార్థి నుంచి మరో విద్యార్థికి మారుతూ ఉంటుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు, టీచర్లు, స్కూల్ కౌన్సిలర్లు హెల్ప్ చేయాలి. ఈ మార్పును ఎలా స్వీకరించాలో వివరించాలి. యాంగ్జయిటీ, డిప్రెషన్ లాంటి మెంటల్ స్టేటస్ ఉంటే వైద్య నిపుణుల సహాయం కోరాలి.

* స్కూల్ రీఓపెన్‌ విషయంలో వారి ఫీలింగ్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడి తెలుసుకుంటే.. అందుకు తగిన విధంగా పిల్లలకు మద్దతు అందించవచ్చు.

* రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్, మీల్స్ టైమ్‌తో పాటు మిగిలిన రొటీన్ ఫాలో అవుతుంటే పిల్లలకు అన్నీ మన కంట్రోల్‌లోనే ఉన్న ఫీలింగ్ రావొచ్చు. కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు.

Next Story