- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Autophagy : అప్పుడప్పుడూ తినడం మానేస్తే ఆరోగ్యానికి మంచిదే! ఎందుకంటే..
ఆటోఫేజీ.. (Autophagy) అంటే మానవ శరీరం కొన్నిసార్లు ఆహారం తీసుకోకపోయినా, ఆకలిగా ఉన్నా తట్టుకోగల శక్తి. ఇది శరీరంలోని సహజ రీసైక్లింగ్ విధానం ద్వారా లభిస్తుంది.

దిశ, ఫీచర్స్ : మనం హెల్తీగా ఉండాలంటే ప్రతిరోజూ శరీరానికి అవసరమైన ఎనర్జీ అందిస్తుండాలి. అంటే ఆహారం తీసుకోవాలి. చాలామంది డైలీ మూడు పూటలు తింటుంటారు. వారి శరీర తత్వాన్ని బట్టి కొందరు ఎక్కువసార్లు, మరికొందరు తక్కువసార్లు కూడా తింటుంటారు. అయితే మనం కొన్నిసార్లు ఆహారం సమయానికి తినకపోయినా లేదా ఒకపూట తినకపోయినా, ఒక రోజు కేవలం ఒకపూటే తిన్నా కూడా పెద్ద నష్టం జరగదు. పైగా ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉపవాసం కూడా దాదాపు ఇలాంటిదే. అయితే ఇది సాధారణ వ్యక్తులకు మాత్రమే.. గర్భిణులు, డయాబెటిక్స్, సాధారణం కంటే తక్కువ బరువు ఉన్నవాళ్లు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవాళ్లకు వర్తించదు.
ఆటోఫేజీ.. (Autophagy) అంటే మానవ శరీరం కొన్నిసార్లు ఆహారం తీసుకోకపోయినా, ఆకలిగా ఉన్నా తట్టుకోగల శక్తి. ఇది శరీరంలోని సహజ రీసైక్లింగ్ విధానం ద్వారా లభిస్తుందని జపాన్ శాస్త్రవేత్త యోషినోరి ఒహ్‌సుమి(Yoshinori Ohsumi)తన పరిశోధనలో కనుగొన్నారు. ఈ ప్రాసెస్ ప్రకారం.. ఆకలిగా ఉన్నప్పుడు లేదా ఏదైనా ఒత్తిడిని అనుభవిస్తున్నప్పుడు మన శరీరంలోని కణాలు తమలోని పాడైన భాగాలను అంటే.. దెబ్బతిన్న ప్రోటీన్లు, ఆర్గనెల్స్ వంటి వాటిని తినేసి, వాటిని రీసైక్లింగ్ చేసుకొని శక్తిని పొందుతాయి. ఆరోగ్యకరమైన కణ భాగాలను తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియను ‘సెల్ఫ్ ఈటింగ్’ అని కూడా అంటారు. ఇది శరీరానికి అతి ముఖ్యమైన రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది.
ఆటోఫేజీ జరగకపోతే.. అంటే.. శరీరంలో కణాల రీసైక్లింగ్ సరిగ్గా పనిచేయకపోతే కూడా.. క్యాన్సర్, అల్జీమర్స్, పార్కిన్సన్స్, డయాబెటిస్, వృద్ధాప్యం వంటివి వేగంగా వస్తాయి. అందుకే అప్పుడప్పుడూ ఇది కూడా అవసరం. నిజానికి ఆటో ఫేజీ అంటే.. గ్రీకు భాషలో “Auto” అంటే.. తను అని, “Phagy” అంటే తినడం అని అర్థం. అంటే కణం తనలోని పాడైన భాగాలను తానే తినేయడం. శరీరంలోని ప్రతీ కణంలో ఉండే నేచురల్ “రీసైక్లింగ్ + క్లీనప్” వ్యవస్థ (Natural “recycling + cleanup” system) వంటిది. అందుకే అప్పుడప్పుడైనా ఆటోఫేజీ అవసరం. ఉపవాసం ఉండటం ఉండటం, ఒత్తిడిని అనుభవించడం, వ్యాయామాలు చేయడం వంటి పరిస్థితుల్లో ఇది ఇది యాక్టివేట్ అవుతుంది.
ఆటోఫేజీ వల్ల శరీరంలో కణాలు రీసైక్లింగ్ ప్రక్రియను పొందుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ కణాల ప్రభావం తగ్గుతుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి మెదడు వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుంది. డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. వృద్ధాప్యం నెమ్మదిస్తుంది. ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్, కీటో డైట్, సాధారణంగా ప్రజలు అప్పుడప్పుడూ ఉండే ఉపవాసం వల్ల కూడా ఈ విధమైన ప్రయోజనాలు కలుగుతాయి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. Link






