- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Space Baseball Video: అంతరిక్షంలో బేస్ బాల్.. ఈ వ్యోమగామి ఎలా ఆడాడో చూడండి!
Space Baseball Video: అపర కుబేరుడు ఎలాన్ మస్క్ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: Space Baseball Video: అపర కుబేరుడు ఎలాన్ మస్క్ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. జపాన్ కు చెందిన వ్యోమగామి కోయిచి వకట ఐఎస్ఎస్ లో బేస్ బాల్ ఆడిన వీడియోను మస్క్ షేర్ చేశారు. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లోరేషన్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి కోయిచి వకట. ఐఎస్ఎస్ లో ఉన్నప్పుడు జీరో గ్రావిటీని ఉపయోగించి బేల్ బాడ్ ఆడారు. తానే బాల్ విసిరి మళ్లీ తానే షాట్ కొట్టిన వీడియోను కోయించి షేర్ చేశారు. ఇది బేస్ బాల్ సీజన్. మేజర్ లీగ్ బేస్ బాల్ సీజన్ జపాన్ లో షురూ అవుతోంది. ఎక్స్ పెడిషన్ 68 సమయంలో ఐఎస్ఎస్ లో బేస్ బాల్ ఆడారు. జీరో గ్రావిటీలో ఈ బేస్ బాల్ ఆడేందుకు జట్టుతో పని లేదంటూ ఆయన పోస్టులో రాసుకొచ్చారు. ఈ వీడియోన్ ఎలాన్ మస్క్ రీపోస్టు చేశారు.
ఈ క్లిప్‌లో కోయిచి వాకటా ఒక చేతిలో గ్లోవ్ ధరించి తన చేతిని పూర్తి చర్యలో ఉంచి బంతిని విసురుతున్నాడు. అతను బంతిని నెమ్మదిగా విసురుతున్నాడు. గురుత్వాకర్షణ కారణంగా అది కూడా హాయిగా ప్రయాణిస్తుంది. ఇంతలో వకాట ఎగురుతూ వచ్చి పక్కన ఉంచిన కర్రను తీసుకొని బంతిని తేలికగా కొట్టాడు. ఆ తర్వాత బ్యాట్ ను అక్కడ వదిలి బాల్ ను పట్టుకునేందుకు ముందుకు వెళ్తాడు. ఈ వీడియో ఇప్పటివరకు 9 కోట్ల 67 లక్షలకు పైగా వ్యూస్.. 6 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.
— Elon Musk (@elonmusk) March 25, 2025
అంతరిక్షంలో బేస్ బాల్ ఆడుతున్న ఈ వ్యక్తిపై యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. స్పేస్ లో కోయిచి వాగట బేస్ బాల్ ను ఆస్వాదిస్తున్నారనేది వాస్తవం కానీ ఆశ్చర్యంగా ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా..."వావ్, ఇది అద్భుతంగా ఉంది" అని మరో నెటిజన్ అన్నాడు. కాగా దాదాపు రెండు దశాబ్దాల పాటు కోయిచి వకాటా వ్యోమగామిగా ఉన్నారు. 2024లో జేఏఎక్స్ ఏ నుంచి రిటైర్ అయ్యారు. ఐదుసార్లు ఐఎస్ఎస్ కు వెళ్లిన కోయిచి మొత్తంగా 500రోజులు అంతరిక్షంలోనే గడిపారు. ఎక్స్ పెడిషన్ 39 సమయంలో ఐఎస్ఎస్ లో తొలి జపనీస్ కమాండర్ గా నిలిచారు. ఇటీవల ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లను మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ తిరిగి భూమీ మీదకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.






