- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India’s Strongest Village : వావ్.. అక్కడి యువకులంతా కండల వీరులే..! ఆ విషయంలో ఇండియాలోనే నంబర్ వన్ విలేజ్ కూడా ఇదే.. !
India’s Strongest Village : వావ్.. అక్కడి యువకులంతా కండల వీరులే..! ఆ విషయంలో ఇండియాలోనే నంబర్ వన్ విలేజ్ కూడా ఇదే.. !

దిశ, ఫీచర్స్ : స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, పర్యావరణ ప్రభావాలు, ప్రజల జీవనశైలి.. ఇలా రకరకాల కారణాలతో కొన్ని గ్రామాలు ప్రత్యేక గుర్తింపును పొందుతుంటాయి. ప్రపంచ వ్యాప్తంగానో, దేశ వ్యాప్తంగానో పాపులర్ అవుతుంటాయి. అయితే మనదేశంలోనూ అలాంటి స్పెషాలిటీ కలిగిన ఓ గ్రామం ఉంది. అదే అసోలా - ఫతేపూర్ బేరి. ప్రజలందరూ బలమైన గ్రామం(India’s Strongest Village)గా పేర్కొనే ఈ ఊరికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఆ వివరాలేంటో చూద్దాం.
అసోలా - ఫతేపూర్ బేరి(Asola and Fatehpur Beri).. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని జంట గ్రామాలివి. ఒకదానికొకటి ఆనుకొని ఉన్నందన ఒకే గ్రామంగా భావిస్తుంటారు చాలా మంది. అయితే దీనికో ప్రత్యేకత ఉంది. ఏంటంటే.. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా కండల వీరులే ఉంటారు. అంటే యువకులంతా సిక్స్ ప్యాక్ వంటి శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారు. అంతెందుకు గూగుల్‌లో ‘ఇండియాస్ స్ట్రాంగెస్ట్ విలేజ్’ అని సెర్చ్ చేస్తే అసోలా ఫతేపూర్ బేరికి సంబంధించిన వివరాలే ప్రత్యక్షమవుతాయి. అందుకే దీనిని ‘బలమైన గ్రామం’గా పిలుస్తారు.
అసోలా ఫతేపూర్ బేరి ‘బలమైన గ్రామం’గా ప్రసిద్ధి చెందడానికి గల మరో ప్రధాన కారణం ఏంటంటే.. ఢిల్లీలోని నైట్ క్లబ్‌లు(nightclubs), బార్‌లు(bars), ఈవెంట్‌ల(events)లో బౌన్సర్‌లుగా, సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్నవారంతా ఈ గ్రామానికి చెందిన యువకులే అత్యధిక మంది ఉంటారు. ఇక్కడే కాదు, దేశ వ్యాప్తంగా ఉన్న బౌన్సర్ కంపెనీల్లో సైతం ఇక్కడి యువత ఎక్కువగా ఉంటోంది. అందుకే అసోలా ఫతేపూర్ బేరి ‘ఇండియాస్ స్ట్రాంగెస్ట్ విలేజ్’గా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు క్యూరియాసిటీతో రియాక్ట్ అవుతున్నారు.






