- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఈరోజెందుకో టైమ్ చాలా ఫాస్ట్‌గా గడిచిపోయింది..!’ అని ఎందుకనిపిస్తుందో తెలుసా?

దిశ, ఫీచర్స్ : మీరెప్పుడైనా విన్నారా ? ‘ఈ రోజు టైమ్ చాలా ఫాస్ట్‌గా గడిచిపోయినట్లనిపిస్తోంది’ అంటుంటారు కొందరు అప్పుడప్పుడు. అయితే చాలా మందిలో ఇదొక కామన్ ఫీలింగ్. కానీ వయసు పెరిగేకొద్దీ ఈ భావన కాస్త అధికంగా కలిగే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబున్నాయి. దీంతో సాధారణంగానే రోజులు, వారాలు, సంవత్సరాలు వేగంగా గడిచిపోతున్నట్లు అనిపిస్తుందని, దీనికి కారణం మెదడు కొత్త అనుభవాలను గుర్తుంచుకునే విధానమని నిపుణులు చెబుతున్నారు.
హిప్పోకాంపస్ అనే మెదడు భాగం కొత్త రోజువారీ సంఘటనలను గుర్తుంచుకుని, వాటిని బలమైన జ్ఞాపకాలుగా నమోదు చేస్తుంది. ఈ కొత్త అనుభవాలు కాలాన్ని సాగదీసినట్టు అనిపిస్తాయి. ఎందుకంటే అవి స్పష్టమైన మానసిక సంకేతాలను సృష్టిస్తాయి. అయితే వయసు పెరిగే కొద్దీ ఈ ప్రాసెస్ రొటీన్‌గా మరుతుంది. ఒకే విధమైన పనులు, అనుభవాలు రోజులు పునరావృతమవుతూ ఉండటంవల్ల, మెదడు అవి తెలిసిన విషయాలుగా భావించడమే కాకుండా జ్ఞాపకాలు తక్కువ స్పష్టంగా నమోదవుతాయి. ఫలితంగా ఈ రోజులు తిరిగి గుర్తుకు వచ్చినప్పుడు కాలం వేగంగా గడిచిపోనట్టు, ఆ సందర్భంలో తక్కువగా అనుభవం లేదా అనభూతికి గురైనట్టు అనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అదనంగా మెదడు వయసుతోపాటు అప్పటికే తెలిసిన సమాచారాన్ని త్వరగా ప్రాసెస్ చేయడానికి ‘స్కీమా’లను ఉపయోగిస్తుంది. ఇది శక్తిని ఆదా చేస్తుంది. కానీ జ్ఞాపక వివరాలను తగ్గిస్తుంది. డోపమైన్ స్థాయిలు తగ్గడం, న్యూరాన్ల పనితీరు మందగించడం వల్ల కూడా కాలం వేగంగా గడిచినట్టు అనిపించేలా చేస్తాయి. Link






