టీనేజ్ అమ్మాయిలు నగ్నంగా స్నానం చేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!

by Bhoopathi Nagaiah |

యుక్త వయసు వచ్చిన అమ్మాయిలు నగ్నంగా స్నానం చేయకూడదంటారు.

టీనేజ్ అమ్మాయిలు నగ్నంగా స్నానం చేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ సంస్కృతిలో సంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలకు పూర్వికులు పెద్దపీఠవేశారు. ప్రతి విషయంలోనూ పురాణాలు, గ్రంధాల ఆధారంగా ఆచారాలను నిర్మించారు. అవ్వే ఆ తర్వాత నమ్మకాలుగా మారిపోయాయి. ఇదే కోవలోకి వస్తుంది నగ్నంగా స్నానం చేయడం. పురాణాల ప్రకారం ఏ స్త్రీ, పురుషుడు కూడా నగ్నంగా స్నానం చేయకూడదని వేద గ్రంధాలలో పేర్కొన్నారట. అందుకే ఎవరూ నగ్నంగా స్నానం చేయకూడదని ఇప్పటికీ మన పెద్దలు చెబుతుంటారు. అసలు ఎందుకు ఒంటిపై బట్టలు లేకుండా స్నానమాచరించకూడదో తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం.. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా స్నానం చేస్తే దుష్టశక్తులు మనిషిపై ప్రభావం చూపిస్తాయట. ముఖ్యంగా స్త్రీ నగ్న దేహాలను ఇష్టపడే అవకాశం ఉందట. సినిమాల్లో చూపించిన విధంగా అవి ఆవహించి కామించే అవకాశం లేకపోలేట. ఇంతే కాదు.. లక్ష్మీదేవికీ నగ్న స్నానం ఇష్టముండదట. ఆమెకు కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్లిపోయి దరిద్రం తాంటవిస్తుందట. యుక్త వయసు వచ్చిన అమ్మాయిలు నగ్నంగా స్నానం చేయకూడదంటారు. పురుషులు సైతం టవల్ అయినా చుట్టకోని స్నానం చేయాలని నియమం పెట్టరట. ఇక స్త్రీలు వక్షోజాలు, జననాంగం కనిపించకుండా వస్త్రం ధరించి స్నానమాచరించాలని పురాణాల్లో పేర్కొన్నారట.

దుష్టశక్తులు, లక్ష్మీదేవి గురించి అలా ఉంచితే.. అసలు నగ్నంగా స్నానం చేయకూడదు అనడానికి ప్రధాన కారణాలు వేరే ఉన్నాయంటున్నారు పెద్దలు. అప్పట్లో బాత్ రూములు లేనందన అందరూ నదులు, చెరువులు, సెలయేర్లలో స్నానమాచరించే వారు. అలా బహిరంగంగా స్త్రీలు దుస్తులు లేకుండా స్నానం చేయడం సరైంది కాదని, అలాగే పురుషులు సైతం కనీసం కౌపీనం అయినా ధరించి స్నానం చేయాలని నిబంధన పెట్టారు. ఆ తర్వాత ఆరు బయట తడకలతో స్నానాలు గదులు నిర్మించుకున్నా.. పై కప్పులు లేకపోవడం ఒక కారణమైతే, విష కీటకాలు వస్తే నగ్నంగా బయటకు రాలేక వాటి భారిన పడతారని కూడా ఇలాంటి ఆచారాలను కొనసాగించినట్టు పెద్దలు చెబుతున్నారు.

ప్రస్తుత ఆధునీక కాలంలో బెడ్‌రూంలో బట్టలు లేకుండానే పడుకుంటున్న ఈ రోజుల్లో ఒక బాత్ రూంలో దుస్తులు ధరించి స్నానం చేయడం అనేది అరుదనే చెప్పాలి. కొన్ని అధ్యయనాలు, సర్వేలు సైతం నగ్నంగా స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తేల్చిచెప్పాయి. అలాగే శరీరం పరిశుభ్రంగా, అన్ని అవయవాలు క్లీన్‌గా ఉండాలంటే నగ్నంగా స్నానం చేయడమే మేలని వైద్యులు సైతం చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం మేరకు ఇవ్వనైనది. దీనిని ‘దిశ’ ధ్రువీకరించడం లేదు. దీనిలో ఎలాంటి సందేహాలు ఉన్నా పండితులను గానీ, వైద్యులను గానీ సంప్రదించండి.

Next Story