- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విటమిన్ ట్యాబ్లెట్స్ వాడుతూ కాఫీ తాగుతున్నారా.. ఏ సమస్యలు రావొచ్చు?
విటమిన్ ట్యాబ్లెట్స్ (vitamin tablets) కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.

దిశ, వెబ్‌డెస్క్: విటమిన్ ట్యాబ్లెట్స్ (vitamin tablets) కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుతాయని నిపుణులు చెబుతుంటారు. ఏవైనా గాయాలైనా తొందరగా మానే అవకాశం ఉంటుంది. బోన్స్ (Bones Strong)ను కూడా స్ట్రాంగ్‌గా ఉంచుతాయి.
ముఖ్యంగా విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. రక్తపోటు స్థాయిలను తగ్గించి (Lower blood pressure levels).. నివారిస్తుంది కూడా. హెయిర్ (Hair), స్కిన్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తుంది. ఈ ట్యాబ్లెట్స్ తో తీసుకున్నప్పుడు పండ్లు, బీన్స్, తాజా కూరగాయలు (Vegetables), పప్పు ధాన్యాలు (Grains), నాన్ వెజ్ కు సంబంధించిన ఫుడ్ ఐటెమ్స్ కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.
అయితే కాఫీ (Coffee) తాగేవారు విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చా? అని చాలా మందిలో సందేహాలు తలెత్తే ఉంటాయి. తాజాగా దీనిపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రతీ రోజూ ఉదయం కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. మార్నింగే కాఫీ తాగడం వల్ల మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. అయితే కాఫీ తాగేవారు అదే క్రమంలో విటమిన్ ట్యాబ్లెట్స్ వాడితే కాస్త ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
ఎందుంటే విటమిన్ ట్యాబ్లెట్స్ బాడీలోకి వెళ్తే.. ఐరన్, విటమిన్ డి, కాల్షియం వంటి వాటిని శరీరం గ్రహిస్తుంది. కాగా నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం, ఆందోళన చెందడం, రక్తపోటు అధికంగా ఉండటం, సడన్‌గా టైడ్ అవ్వడం వంటి ప్రాబ్లమ్స తలెత్తుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
నార్వేజియన్ అధ్యయనంలో ఇరవై వేల మంది మహిళలపై పరిశోధన జరపగా.. రోజుకు తొమ్మిది కప్పుల కాఫీ తాగేవారిలో బోన్స్ విరిగే అవకాశం ఉందని వెల్లడైంది. అలాగే పీరియడ్స్ లో ఉన్నవారు తాగినా బోన్స్ వీక్ అవుతాయని చెబుతున్నారు. వీళ్లు తీసుకునే ఫుడ్‌లో విటమిన్లు బాడీ గ్రహించకుండా టాయిలెట్ ద్వారా బయటకు పంపేస్తుందని పేర్కొన్నారు. ఒకవేళ తప్పక కాఫీ తాగుతూ విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలని భావిస్తే కనుక.. కాఫీ తాగే ఒక గంట ముందు లేదా తాగిన గంట తర్వాత తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.






